Begin typing your search above and press return to search.

మొదలైన విజయ్ - రష్మిక పెళ్లి పనులు.. అదిరిపోయే డెకరేషన్ తో..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'గీతగోవిందం' సినిమా సమయం నుంచే రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   19 Feb 2026 5:59 PM IST
మొదలైన విజయ్ - రష్మిక పెళ్లి పనులు.. అదిరిపోయే డెకరేషన్ తో..
X

ఒక రహస్యాన్ని ఎన్ని రోజులు దాచగలం.. అలా దాదాపు నాలుగు సంవత్సరాలుగా తమ బంధాన్ని అత్యంత రహస్యంగా దాస్తూ వస్తున్న టాలీవుడ్ రూమర్డ్ జంట మరికొన్ని రోజుల్లో ఆ రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నారు. నిజానికి వీరి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోతున్నా.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా.. ఈ జంట మాత్రం తమకేమీ తెలియదు అన్నట్టు.. పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'గీతగోవిందం' సినిమా సమయం నుంచే రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏ రోజు కూడా ఆ వార్తలను వీరు ఖండించే ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కనీసం ఈ విషయాన్ని అయినా అధికారికంగా బయటపడతారు అనుకున్నా.. అది కూడా జరగలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లికి కూడా సిద్ధం అయిపోయారు. ఉదయపూర్ లోని ప్రాచీన ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక కూడా అందించారు. దీనికి తోడు ఈ జంటకు సంబంధించిన పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వీరు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.

అడిగితే తమకేమీ తెలియదు అన్నట్టు పక్కకి తప్పుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక కెమెరామెన్ ఫిబ్రవరి 26 కోసం వెయిట్ చేస్తున్నామని విజయ్ దేవరకొండ ను అడిగితే.. ఆయన మాత్రం ఎందుకు వెయిటింగ్.. 26వ తేదీ ఎలాగో వస్తుంది కదా.. అంటూ చమత్కరించి వెళ్లిపోయారు. ఇటు రష్మిక కూడా జైపూర్ లోని సెలూన్ నుండి బయటకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చిందే కానీ అసలు విషయాన్ని చెప్పలేదు.. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇల్లు లైటింగ్ తో.. అదిరిపోయే డెకరేషన్ తో మిరుమిట్లు గొలుపుతూ అత్యంత సుందరంగా ముస్తాబయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఫిబ్రవరి 26వ తేదీన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఈ వేడుక ఇప్పటివరకు అధికారికం కాలేదు. కానీ అన్ని పనులు లోలోపలే చక్కబెడుతూ ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . మరొకవైపు ఇంత జరుగుతున్నా.. ఎందుకు ఈ జంట ఓపెన్ గా ప్రకటించడం లేదు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఇన్ని సంవత్సరాలుగా రహస్యంగా తమ బంధాన్ని మెయింటైన్ చేసిన ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.

ఇకపోతే మరొకవైపు మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ రిసెప్షన్ వేడుకకు విజయ్ దేవరకొండ, రష్మిక తో కలిసి పనిచేసిన దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, సన్నిహితులు హాజరుకానుండగా.. రష్మిక - విజయ్ దేవరకొండ తో కలిసి పనిచేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్లు సమాచారం.