Begin typing your search above and press return to search.

ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్న విరోష్ జంట..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఒక అందమైన కావ్యంలా అనిపిస్తుంది. కేవలం పెళ్లి చేసుకోవడమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని ప్రేమను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానుల మనసు గెలుచుకున్నారు.

By:  Madhu Reddy   |   27 Feb 2026 6:25 PM IST
ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్న విరోష్ జంట..
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఒక అందమైన కావ్యంలా అనిపిస్తుంది. కేవలం పెళ్లి చేసుకోవడమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని ప్రేమను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానుల మనసు గెలుచుకున్నారు. "నా బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నా" అని విజయ్ అంటే, "నువ్వు నా జీవితంలో దొరికిన అతిపెద్ద అదృష్టం" అని రష్మిక ఎమోషనల్ అయ్యింది. వీరిద్దరి వెడ్డింగ్ పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట ప్రేమ వర్షం కురిపిస్తున్నాయి. ఆ ముచ్చటైన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

నా ప్రాణ స్నేహితురాలే నా భార్య.. విజయ్ ఎమోషనల్ పోస్ట్:

విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక గురించి రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఇక రష్మిక తన పక్కన ఉంటేనే ఆ రోజు పరిపూర్ణంగా ఉంటుందని, తను లేని రోజు ఏదో వెలితిగా అనిపిస్తుందని విజయ్ పేర్కొన్నాడు. "ఆమె పక్కన ఉంటే తినే భోజనం రుచిగా ఉంటుంది, చేసే వర్కౌట్ సరదాగా ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలంటే రష్మిక నా పక్కనే ఉండాలి" అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన ప్రాణ స్నేహితురాలినే జీవిత భాగస్వామిగా పొందినందుకు విజయ్ ఎంతో గర్వంగా, సంతోషంగా ఉన్నానని చెబుతూ తన ప్రేమను చాటుకున్నాడు.

నా విజయం.. నా ప్రపంచం నువ్వే:

ఇక రష్మిక తన భర్తను పరిచయం చేస్తూ రాసిన పోస్ట్ ఇన్ స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. "నిజమైన ప్రేమ అంటే ఏంటో, ప్రశాంతత అంటే ఏంటో విజయ్ నాకు నేర్పాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించగలనని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ నా వెంటే నిలుస్తాడు" అని రష్మిక తన సంతోషాన్ని పంచుకుంది. విజయ్ గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చని, తను కలలుగన్న వ్యక్తిలా ఇప్పుడు మారానంటే దానికి కారణం విజయ్ మాత్రమేనని ఆమె ఎమోషనల్ అయ్యింది. 'విజ్జూ' అంటూ ముద్దుగా పిలుచుకుంటూ, అతని భార్యగా పిలిపించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

పద.. కలిసి అత్యుత్తమ జీవితాన్ని గడుపుదాం:

జీవితంలో వచ్చే కష్టసుఖాలు, విజయాలు, బాధలు అన్నీ పంచుకోవడానికి ఇప్పుడు ఒక తోడు దొరికిందని ఈ జంట ఆనందం వ్యక్తం చేస్తోంది. "ఇకపై నా జీవితంలో ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు" అంటూ రష్మిక విజయ్‌కి ప్రామిస్ చేసింది. ఇక ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అని, ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుదామని రష్మిక తన పోస్ట్‌ను ముగించింది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న ఈ అండర్ స్టాండింగ్, ప్రేమ చూసి నెటిజన్లు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.