ఆ ఇద్దరినీ మధ్య తరగతి ఆలోచలు కలిపాయా?
కానీ చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. తాజాగా వారి స్నేహానికి సంబంధించి రష్మిక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
By: Srikanth Kontham | 28 Jan 2026 5:00 PM ISTవిజయ్ దేవరకొండ-రష్మికా మందన్నా జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటీనటులుగా కలిసి మొదలు పెట్టిన ప్రయాణం ఇప్పుడు జీవితాలను పంచుకునే వరకూ వచ్చింది. మనసులు కలవడంతో ఇద్దరు ఒకటి కావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి కే నిశ్చితార్దం జరిగింది. మరికొన్ని రోజుల్లో వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి వీరిద్దరు మనసులు కలవడానికి అసలు కారణం ఏంటి? అంటే ఇవీ కొన్ని కారణాలుగా తెలుస్తోంది.
విజయ్-రష్మిక కలిసి నటించింది రెండు సినిమాలే. హాయ్ చెబితే హాయ్ చెప్పే స్నేహమే తప్ప అంతకు మించి పరిచయం లేదు. కానీ చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు. తాజాగా వారి స్నేహానికి సంబంధించి రష్మిక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
ఇద్దరివి మధ్య తరగతి కుటుంబాలు కావడంతో? తమ ఆలోచనలు కలిసాయంది. ఇద్దరు ఒకేలా ఆలోచించచడం ..పని విషయంలో ఆచరణ కూడా ఒకేలా ఉంటుందని రష్మిక తెలిపింది. ఎప్పుడు ఏ చిన్న సహాయం కావాలన్నా? విజయ్ ఒక్క ఫోన్ కాల్ తోనే స్పందించేవాడుట. అవసరమైన సూచనలు, సలహాలు అన్ని వెంట వెంటనే ఇచ్చే స్తాడంది. `పుష్ప 2` సినిమాలో ఓ సీన్ లో ఎలా నటించాలో అర్దం కాలేదుట రష్మికకు. చాలా అటెంప్ట్ లు చేసి ఫెయిలైందిట. దీంతో ఒత్తిడికి గురైందంది. చివరికి విసుగుపోయి ఆ సీన్ వదిలేద్దామని దర్శకుడితో చెప్పా లనుకుందిట.
అదే సమయంలో విజయ్ కు ఫోన్ చేయగానే ఎలా నటించాలో చెప్పడం ఇప్పటికీ గుర్తుందన్నారు. ఇండస్ట్రీలో విజయ్ లాంటి మంచి స్నేహితుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానంది. అదే స్నేహితుడిని భర్త గానూ పొందు తుంది. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. విజయ్ నటిస్తోన్న 14వ చిత్రంలో ఈ భామే హీరోయిన్ గా నటిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని ఓ ఇద్దరు డైరెక్టర్లు సీరియస్ గానే ప్రయత్నించారు.
కానీ సెట్ అవ్వలేదు. రాహుల్ కథకే ఆ జోడీ కనెక్ట్ అయింది. ప్రేమికులుగా మారిన తర్వాత నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. రిలీజ్ అయ్యే మొదటి చిత్రం కూడా ఇదే అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు `రౌడీ జనార్దన` షూటింగ్ లో నూ పాల్గొంటున్నాడు. రష్మిక మాత్రం `మైసా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంతో పాటు, బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2` లో నటిస్తోంది. కొత్త కథల విషయంలోనూ అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
