Begin typing your search above and press return to search.

రష్మిక - విజయ్ పెళ్లి.. రాబోతున్న ముఖ్య అతిథులు వీరే!

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి వార్త ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది.

By:  Madhu Reddy   |   15 Feb 2026 7:00 PM IST
రష్మిక - విజయ్ పెళ్లి.. రాబోతున్న ముఖ్య అతిథులు వీరే!
X

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి వార్త ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఎప్పుడు అడిగినా మేము కేవలం స్నేహితులం అని దాటవేస్తూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు ఏకంగా ఏడడుగులు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో వీరి వివాహ వేడుక జరగనుందనే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కలవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్‌కు సంబంధించిన అతిథుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వివరాలలోకి వెళితే..

ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి:

విజయ్, రష్మికల పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి 26న ఖరారైనట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక రాజభవనంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. అయితే, అసలైన హంగామా మాత్రం హైదరాబాద్‌లో ఉండబోతోంది. మార్చి 4న నగరంలోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడం ఈ పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. 2025 అక్టోబర్‌లోనే వీరిద్దరికీ సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగిందని, అప్పటి నుంచే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.

గెస్ట్ లిస్ట్‌లో దిగ్గజాలు.. రాబోతున్న అతిథులు వీరే:

ఈ క్రేజీ జంట రిసెప్షన్‌కు సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ వరకు స్టార్ల సందడి ఉండబోతోంది. ముఖ్యంగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. రష్మిక, విజయ్‌లతో కలిసి పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. బాలీవుడ్ నుంచి కూడా కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ వేడుకలో మెరిసే అవకాశం ఉంది. ఉదయ్‌పూర్ పెళ్లిని ఎంత సీక్రెట్‌గా ఉంచాలని చూసినా, హైదరాబాద్ రిసెప్షన్ మాత్రం కంటికి పండుగలా, తారల మెరుపులతో అట్టహాసంగా సాగనుందని తెలుస్తోంది.

ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న శుభఘడియలు:

'గీత గోవిందం' సినిమా నుంచి మొదలైన వీరిద్దరి కెమిస్ట్రీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటవుతుండటం అభిమానులకు కడుపు నిండినంత ఆనందాన్ని ఇస్తోంది. ఇప్పటికీ ఈ జంట అధికారికంగా నోరు విప్పకపోయినా, పెళ్లి ఖాయం అని అందరికి తెలిసిందే, మరి ఉదయ్‌పూర్ కోటలో ఈ రౌడీ హీరో, నేషనల్ క్రష్ రష్మికల పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయా అని నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి మొదటి వారం కల్ల టాలీవుడ్ మరో అద్భుతమైన జంటను తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వార్త ఫాన్స్ కు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.