ఒకే రోజు 2సార్లు పెళ్లి చేసుకోబోతున్న విజయ్ - రష్మిక!
ఇకపోతే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే వీరిద్దరూ ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 24 Feb 2026 6:08 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఉదయపూర్ లో పెళ్లి పనులు మొదలయ్యాయి. వేదికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దగ్గరుండి మరీ చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే వీరిద్దరూ ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒకే రోజు రెండు పద్ధతుల్లో వివాహం..
ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్ లో ఉదయపూర్ లోని ప్యాలెస్ లో జరిగే ఈ వివాహ వేడుక రెండు పద్ధతుల్లో జరగబోతోంది. ఉదయం విజయ్ దేవరకొండ - రష్మికలు (తెలుగు) హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ బంధంలోకి అడుగు పెడుతుండగా.. సాయంత్రం రష్మిక మందన్న మత ఆచారాల ప్రకారం కర్ణాటక (కొడువ) పద్ధతిలో వివాహం చేసుకోబోతున్నారు. అలా ఈ ఇద్దరు తమ మత ఆచారాల ప్రకారం రెండు పద్ధతుల్లో ఒకేరోజు వివాహం చేసుకోబోతున్నారని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట తమ తమ పద్ధతులలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని చెప్పవచ్చు.
సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్..
ఫిబ్రవరి 26న వివాహం జరిగితే మార్చి 3వ తేదీన హైదరాబాద్ వేదికగా తాజ్ కృష్ణ హోటల్లో వీరిద్దరూ రిసెప్షన్ జరుపుకోనున్నారు. పైగా ఈ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన అతిధులను ఇప్పటికే విజయ్ దేవరకొండ దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. పైగా సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ ఫ్యామిలీలతో పాటు రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ తో కలిసి పనిచేసిన సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఏది ఏమైనా ఎనిమిదేళ్ల రహస్య ప్రేమాయణం తర్వాత అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఒకటి కాబోతోంది.
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రాలు..
2018లో గీతాగోవిందం సినిమా ద్వారా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నారు ఈ జంట. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి మరోసారి తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు . మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ జంట ఒకే తెరపై కనిపించబోతున్నారు. ప్రముఖ రచయిత కం డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్న ఈ జంట.. అటు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత అందుకోబోయే తొలి సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
