ఓటీటీ ఆఫర్‌కు విజయ్ రష్మిక 'నో' చెప్పారా?
అయితే ఈ పెళ్లి వేడుక చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
By: M Prashanth | 12 Feb 2026 3:43 PM ISTటాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. రౌడీ హీరో, నేషనల్ క్రష్‌ల వెడ్డింగ్ అంటే అది కచ్చితంగా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతుంది. అయితే ఈ పెళ్లి వేడుక చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రైవేట్ సెలబ్రేషన్స్ విషయంలో విజయ్ తీసుకున్న ఒక బోల్డ్ డెసిషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఈ మధ్య కాలంలో స్టార్ సెలబ్రిటీల వెడ్డింగ్స్ అంటే అదొక పెద్ద బిజినెస్ డీల్‌లా మారిపోయింది. పెళ్లి షూటింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తున్నాయి. బాలీవుడ్ నుండి సౌత్ వరకు చాలా మంది స్టార్లు తమ పెళ్లి వీడియోలను ఇలాగే ఓటీటీలకు అమ్మేస్తున్నారు. విరాట్ కోహ్లీ అనుష్క నుండి మొన్నటి నయనతార వరకు అందరూ ఇదే రూట్ ఫాలో అయ్యారు. కానీ విజయ్ రష్మిక జంట మాత్రం ఈ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.
తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిన భారీ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించారట. కోట్లు కుమ్మరిస్తామన్నా సరే, తన వ్యక్తిగత జీవితాన్ని ఇలా వ్యాపారం చేయడం విజయ్‌కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఒక ప్రైవేట్ వేడుకలా ఉంచుకోవాలని ఈ క్రేజీ కపుల్ గట్టిగా డిసైడ్ అయ్యారట.
ఈ నిర్ణయం వెనుక నయనతార వెడ్డింగ్ వీడియో వివాదం కూడా ఒక కారణమై ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నయన్ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు, హీరో ధనుష్‌తో వచ్చిన గొడవలు అందరికీ తెలిసిందే. అలాంటి అనవసరపు తలనొప్పులు తమకు వద్దని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బిజినెస్ కంటే ప్రైవసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారట. కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచించకుండా ఇలా పర్సనల్ స్పేస్ కి వాల్యూ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన లైఫ్ స్టైల్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంటారు. బయట ఎంత రౌడీగా కనిపించినా, ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం చాలా సెన్సిటివ్. రష్మిక కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఓటీటీ సంస్థకు నిరాశ తప్పలేదు. కేవలం డబ్బు కోసం తమ ప్రైవేట్ మూమెంట్స్ ని పబ్లిక్ లో పెట్టడం కంటే, ఆ జ్ఞాపకాలను తమలోనే దాచుకోవడం బెటర్ అని వారు భావిస్తున్నారు.
ఏది ఏమైనా విజయ్ రష్మిక పెళ్లి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్ లేకపోయినా, బిజినెస్ లేకపోయినా వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో పెళ్లి బట్టల్లో చూడటం ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. ప్రైవేట్ గా జరిగినా ఆ వేడుక ఫొటోలు బయటకు వస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. మరి ఈ రౌడీ వెడ్డింగ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.
