సొంతూర్లో ఊరందరికీ పెళ్లి భోజనం పెట్టిన విజయ్.. మెనూలో ఏమేమి వంటకాలు ఉన్నాయంటే?
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్-రష్మిక పెళ్లయిన వెంటనే సినిమాలతో బిజీ అయిపోకుండా, తన మూలాలను మర్చిపోకుండా, సొంతూరికి వెళ్లారు.
By: Madhu Reddy | 2 March 2026 4:47 PM ISTటాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్-రష్మిక పెళ్లయిన వెంటనే సినిమాలతో బిజీ అయిపోకుండా, తన మూలాలను మర్చిపోకుండా, సొంతూరికి వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్‌పేటలో కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం మరియు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఊరి వారితో పాటు వేలాది మంది అభిమానులకు అసలైన తెలంగాణ రుచులతో భారీ విందును ఏర్పాటు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు ..ఆ విశేషాలు చూద్దాం..
కొత్త జంట సత్యనారాయణ వ్రతం.. పద్ధతిగా మెరిసిన రష్మిక:
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి తర్వాత మొదటిసారి తమ సొంత ఊరైన తుమ్మన్‌పేటలో అడుగుపెట్టారు. ఇక అక్కడ కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్‌లో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. అనంతరం దంపతులు ఇద్దరూ పట్టువస్త్రాలు ధరించి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్నారు. ఇక రష్మిక తెలుగు ఇంటి కోడలిలా ఎంతో పద్ధతిగా తులసి పూజలో పాల్గొంటున్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ కంటే ముందే, ఇలా తమ ఆచారాల ప్రకారం దేవుడి ఆశీస్సులు తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
అభిమానులకు విందు.. మెనూలో తెలంగాణ స్పెషల్స్:
తన పెళ్లి ఆనందాన్ని కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయకుండా, తనను ఆదరించిన ఊరి జనానికి మరియు అభిమానులకు భారీ ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారు విజయ్. సుమారు 2 వేల మందికి పైగా ఈ విందులో పాల్గొన్నారు. మెనూ విషయానికి వస్తే.. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పసందైన విందు సిద్ధమైంది. ఇక వేడివేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయతో పాటు నాటుకోడి పులుసు, మటన్ కర్రీ వంటి నాన్-వెజ్ వంటకాలు హైలైట్‌గా నిలిచాయి. అక్కడ ఎవరిని అడిగిన వాళ్ళ సంతోషాన్ని,విజయ్ ధర్మాత్ముడు అని కొనియాడుతున్నారు. ఇక తీపి పదార్థాలతో ఊరంతా కడుపునిండా భోజనం చేశారు.
రిసెప్షన్ పనుల్లో బిజీ.. త్వరలో గ్రాండ్ సెలబ్రేషన్:
ఈ జంట సొంతూర్లో వేడుకలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. 'రష్మిక'ను తన జీవిత భాగస్వామిగా పరిచయం చేసే ఈ వేడుక కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఊరి వారందరికీ భోజనం పెట్టి తన పెద్ద మనసు చాటుకున్న విజయ్, ఇప్పుడు రిసెప్షన్ ట్రీట్ ఎలా ఇవ్వబోతున్నారో అని అందరూ చర్చించుకుంటున్నారు..
