ఫ్యాన్స్ కోసం సందీప్ వాళ్లను కలిపే ప్రయత్నం!
సందీప్ ఇప్పటికే ఇద్దరితో వేర్వేరుగా సినిమాలు చేసారు. విజయ్ దేవరకొండతో `అర్జున్ రెడ్డి`..రష్మికా మందన్నాతో `యానిమల్` సినిమాకు పనిచేసారు.
By: Srikanth Kontham | 6 Oct 2025 8:50 AM ISTవిజయ్ దేవరకొండ-రష్మికా మందన్నా ప్రేమలో పడటం కన్పమ్ అయింది. ఇంతకాలం ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ కేవలం స్నేహం వరకే అనుకున్నా? అంతకు మించి ప్రేమ పరుగులు పెడుతుందని క్లారిటీ వచ్చేసింది. మరీ రిలే షన్ షిప్ ని పెళ్లి వరకూ తీసుకెళ్తారా? లేదా? అన్నది తర్వాత సంగతి. కానీ ఈ జోడీతో దర్శక సంచలనం సందీప్ రెడ్డి వంగా సినిమా తీస్తే అదిరిపోతుందన్నది ట్రెండింగ్ లోకి వస్తోన్న అంశం. సందీప్ ఇప్పటికే ఇద్దరితో వేర్వేరుగా సినిమాలు చేసారు. విజయ్ దేవరకొండతో `అర్జున్ రెడ్డి`..రష్మికా మందన్నాతో `యానిమల్` సినిమాకు పనిచేసారు.
వాళ్లిద్దరితో సందీప్ మార్క్ ట్రీట్ మెంట్:
కానీ వాళ్లిద్దర్ని ఒకే ప్రేమ్ లో తాను మాత్రం చూపించలేకపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరితో తన మార్క్ లవ్ స్టోరీ తీస్తే అదిరిపోతుందన్నది యవతలో చర్చకు దారి తీస్తుంది. అర్జున్ రెడ్డి లో ప్రేమికుడిని... యానిమల్ లో ప్రేమికురాలిని కలిపి సందీప్ మార్క్ ట్రీట్ మెంట్ ఇస్తే మరో సంచలనం ఖాయమంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ రన్నింగ్ చేస్తుందన్న సంగతి ఇప్పుడే అధికారికంగా తెరపైకి వచ్చి నేపథ్యంలో ఆ బాండింగ్ ఎలా సాగుతుందన్నది కాలక్రమంలో మరింత సమాచారం దొరుకుతుంది.
అభిమానుల కోరిక మేరకు:
దాని ఆధారంగా సందీప్ కథ అల్లగలిగితే బాగుంటుందని ఓ నెటి జనుడు సలహా ఇచ్చాడు. మరి సందీప్ రెడ్డి మనసులో వాళ్లిద్దరు ఉన్నారా? లేరా? అన్నది తెలియాలి. విజయ్ దేవరకొండ- రష్మికా మందన్నా ఇప్పటికే కలిసి మూడు సినిమాలు చేసినప్పటికీ.. ఆ కాంబోని సందీప్ డైరెక్ట్ చేస్తే చూడాలన్నది పలువురు నెటి జనుల కోరికగా తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయన్ గా నటిస్తోంది. కానీ తాము కోరుకుంటున్నది సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో అంటూ ప్రత్యేకించి మరీ అడుగుతున్నారు ఫ్యాన్స్.
ముగ్గురు బిజీ బిజీగా:
మరి ఇంతటి డైహార్డ్ అభిమానుల కోరిక మన్నించి సందీప్ రంగంలోకి దిగితే సరి. ప్రస్తుతం ముగ్గురు వేర్వేరుఉ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ పాన్ ఇండియాలో భారీ ఎత్తున `స్పిరిట్` సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విజయ్ `రౌడీ జనార్దన్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రష్మిక తెలుగు, హిందీ సినిమాలంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరి ఇంతటి టఫ్ సిచ్వేషన్ మధ్యలో ఆ త్రయం విషయాన్ని కన్సిడర్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
