Begin typing your search above and press return to search.

క్లిప్ ఆంటీ, మామ కు పిల్లల మ్యారేజ్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్!

వీడియోలో పిల్లల తల్లి మీ క్లిప్ ఆంటీకి పెళ్లైపోయింది కదా అని అడగగా, ఆ ట్విన్స్ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా అవును అయిపోయింది అని సమాధానం ఇస్తారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 March 2026 7:48 PM IST
క్లిప్ ఆంటీ, మామ కు పిల్లల మ్యారేజ్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్!
X

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ జంటల్లో ఒకటైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉద‌య‌పూర్ లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అనంతరం పలువురు సన్నిహితులు, స్నేహితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విందు భోజనాలు ఏర్పాటు చేసి వార్త‌ల్లో నిలిచారు. మార్చి 4న జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌తో వివాహ వేడుకలు ముగిసినప్పటికీ, ఈ జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ఇద్దరు చిన్నారులు ఈ జంటకు చెప్పిన విషెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ట్విన్ పిల్లలు ఎంతో అమాయకంగా రష్మిక, విజయ్‌కు మ్యారేజ్ విషెస్ చెప్పారు. అయితే వారు రష్మికను క్లిప్ ఆంటీ అని, విజయ్‌ను మామ అంటూ సంబోధించడం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

క్లిప్ ఆంటీకి ఫోన్ కెమెరా గిఫ్ట్‌లు

వీడియోలో పిల్లల తల్లి మీ క్లిప్ ఆంటీకి పెళ్లైపోయింది కదా అని అడగగా, ఆ ట్విన్స్ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా అవును అయిపోయింది అని సమాధానం ఇస్తారు. మ‌రి మీ క్లిప్ ఆంటీకి ఏం గిఫ్ట్ ఇస్తావు?, నీ ఫేవ‌రెట్ క‌దా అని అడగగా, పిల్లలు చిన్న చిన్న బొమ్మలను చూపిస్తూ ఇవి మామకి ఇస్తాన‌ని చెప్తూ దానిపై వి, ఆర్ అనే అక్ష‌రాల‌ను రాశారు. పెళ్లి కూతురైన క్లిప్ ఆంటీకి ఫోన్, కెమెరా గిఫ్ట్ ఇస్తానని, వాటిని ప్యాక్ చేసి పంపించ‌మ‌ని త‌న త‌ల్లికి చెప్ప‌గా, వాళ్ల‌ అడ్రస్ నాకు తెలియదని, తర్వాత తెలుసుకుని పంపిస్తాన‌ని చెప్ప‌డం ఆ వీడియోలో క్లియ‌ర్ గా ఉంది. అయితే పిల్ల‌లు రష్మికను క్లిప్ ఆంటీ అని పిలవడం వెనుక ఉన్న ఫన్నీ రీజ‌న్ ను కూడా పిల్లల తల్లి వివరించింది. పుష్ప‌2లోని సూసేకి సాంగ్ మేకింగ్ వీడియోలో రష్మిక పెట్టుకున్న హెయిర్ క్లిప్, ఆమె హెయిర్ స్టైల్ పిల్లలకు బాగా నచ్చిందట. అప్పట్లో వారు చాలా చిన్నవాళ్లు కావడంతో ఎలా పిలవాలో తెలియక క్లిప్ ఆంటీ అని పిలవడం అలవాటు అయిందని ఆమె చెప్పారు.

చిన్నారుల వీడియోకు రెస్పాండ్ అయిన విజ‌య్, ర‌ష్మిక‌

అయితే ఈ వీడియో మొత్తానికి విజ‌య్, ర‌ష్మిక క‌ళ్ల‌లో ప‌డింది. ఆ వీడియోను త‌న స్టోరీగా షేర్ చేస్తూ, మీరు హైద‌రాబాద్ కి వచ్చినప్పుడు నాకు చెప్పమని అమ్మకు చెప్పండి. మీరు మా ఇంటికి రావాలి. మీ గిఫ్ట్స్ తీసుకోవడానికి నేను వెయిట్ చేస్తున్నానంటూ ప్రేమగా రాసింది. విజ‌య్ ఆ వీడియోకు కామెంట్ చేస్తూ “క్లిప్ ఆంటీ, మామ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. బోలెడు హగ్స్, కిస్సెస్ పంపుతున్నాం. మీ గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం” రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా చిన్నారుల అమాయకత్వానికి, అలాగే వారి విషెస్‌కు రష్మిక, విజయ్ ఎంతో ప్రేమగా స్పందించిన తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/reel/DVPqIX-FjnK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==