మెహందీ వేడుకల్లో విరోష్ జంట ధరించిన అవుట్ ఫిట్ ప్రత్యేకత తెలిస్తే షాక్!
దక్షిణ భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ వేడుక డ్రెస్సింగ్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
By: Madhu Reddy | 11 March 2026 5:40 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వీరి పెళ్లి సందడి ఇంకా జరుగుతున్నట్టే వుంది. తాజాగా వీరి మెహెందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకలో వీరు ధరించిన రంగురంగుల దుస్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఈ అవుట్‌ఫిట్స్ వెనుక ఒక గొప్ప అర్థం, కళాత్మకత కూడా దాగి ఉంది. దక్షిణ భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ వేడుక డ్రెస్సింగ్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
దక్షిణాది కళాకృతి - రష్మిక రాజసం:
మెహెందీ వేడుకలో రష్మిక ధరించిన డ్రెస్ చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ కరణ్ తోరానీ దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. దక్షిణ భారత దేశపు ప్రసిద్ధ 'తంజావూరు పెయింటింగ్స్' స్ఫూర్తితో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు. మెరూన్, ఆలివ్ గ్రీన్, మరియు ఇండిగో బ్లూ రంగుల కలయికలో ఉన్న ఎంబ్రాయిడరీ స్కర్ట్, దానికి జతగా ఆఫ్-షోల్డర్ కార్సెట్ బ్లౌజ్ ధరించి రష్మిక మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె దుపట్టాపై లక్ష్మీదేవి ప్రతిమను ఎంబ్రాయిడరీ చేయడం హైలైట్ అని చెప్పాలి. ఇది కేవలం డ్రెస్ మాత్రమే కాదు, ఒక గొప్ప కళాఖండంలా కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ 'ప్రిన్స్' లుక్ - స్పెషల్ అట్రాక్షన్:
ఇక పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ కూడా ఫ్యాషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. రష్మిక డ్రెస్‌కు మ్యాచింగ్ అయ్యేలా గ్రీన్ కలర్ కుర్తా, దానిపై భారీ ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ ధరించి ఒక యువరాజులా కనిపిస్తున్నాడు. ఇక కింద ఇండిగో కలర్ పంచె కట్టు తో పక్కా ట్రెడిషనల్ లుక్ ఇచ్చాడు. వీటికి తోడు మెడలో ధరించిన స్టేట్‌మెంట్ నెక్లెస్, నడుముకు పెట్టుకున్న వెయిస్ట్ బెల్ట్ విజయ్ లుక్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. మొత్తానికి విజయ్ తన స్టైల్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు.
అత్తగారి కానుక - ఆభరణాల వెనుక కథ:
రష్మిక ధరించిన నగలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. విజయ్ తల్లి తన కోడలికి బహుమతిగా ఇచ్చిన 'ది ఎటర్నల్ బ్లోసమ్' అనే హెయిర్ లూమ్ నెక్లెస్‌ను రష్మిక ఈ వేడుకలో ధరించింది. ఇందులో రోజ్-కట్ డైమండ్స్ మరియు బర్మీస్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. దీనికి సరిపడా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్‌ను శ్రీ జ్యువెలర్స్ వారు డిజైన్ చేశారు.ఇక హెయిర్ స్టైల్‌లో వాడిన మెజెంటా కలర్ యాక్సెసరీ కూడా రష్మిక లుక్‌కు అదనపు అందాన్ని ఇచ్చింది. అటు సంప్రదాయం, ఇటు మోడ్రన్ టచ్ కలగలిపి ఈ జంట మెహెందీ వేడుకలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
