Begin typing your search above and press return to search.

విజయ్ రింగ్ తో కన్ఫర్మ్ చేశాడా?

అయితే ఈ ఎంగేజ్మెంట్ ని అత్యంత రహస్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు సంబంధించిన ఒక్క ఎంగేజ్మెంట్ ఫోటో కూడా బయటికి రాలేదు.

By:  Madhu Reddy   |   6 Oct 2025 12:15 PM IST
విజయ్ రింగ్ తో కన్ఫర్మ్ చేశాడా?
X

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ అక్టోబర్ 3 శుక్రవారం రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ ఎంగేజ్మెంట్ ని అత్యంత రహస్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు సంబంధించిన ఒక్క ఎంగేజ్మెంట్ ఫోటో కూడా బయటికి రాలేదు. దాంతో ఈ జంట ఎందుకు అంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇండస్ట్రీ వాళ్లకు కూడా తెలియకుండా అత్యంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం వెనక కారణం ఏంటి? అని పలువురు భావిస్తున్న వేళ..సడన్ గా విజయ్ దేవరకొండ పుట్టపర్తిలో ప్రత్యక్షమయ్యారు. దీనికి తోడు ఆయన చేతికి ఉన్న ఉంగరం ఇప్పుడు అందరిలో ఎంగేజ్మెంట్ వార్తలను కన్ఫర్మ్ చేసింది అని చెప్పవచ్చు.

విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి మీడియా ముందు కనిపించారు. పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకోవడం కోసం విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ తో కలిసి ఇక్కడికి వచ్చారు. అయితే పుట్టపర్తికి వచ్చిన సమయంలో కొంతమంది అక్కడి స్థానికులు విజయ్ దేవరకొండకు బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. సాధారణంగా ఒక హీరో వస్తున్నాడు అంటే ఆ హడావిడి మాములుగా ఉండదు. అలా మీడియా వాళ్లందరూ అక్కడ గుమిగూడి విజయ్ దేవరకొండను ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఈ ఫొటోస్, వీడియోస్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ ఫొటోస్ లో నెటిజన్స్ ఓ విషయాన్ని గుర్తుపట్టారు. అదేంటంటే విజయ్ దేవరకొండ చేతికి ఎంగేజ్మెంట్ రింగు.. ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. చేతివేలికి రింగ్ తో కనిపించడంతో ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని అందరూ భావిస్తున్నారు.

అంతేకాదు ఎంగేజ్మెంట్ తర్వాత తాము దైవంగా కొలిచే పుట్టపర్తి సత్య సాయిబాబా సమాధిని దర్శించుకున్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ ఎంగేజ్మెంట్ గురించి బయటకి చెప్పకపోయినప్పటికీ విజయ్ చేతి వేలికున్న రింగుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు క్లారిటీ వచ్చింది అని భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ తన చేతి వేలికి ధరించిన రింగుతో ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసేసారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల విషయానికొస్తే.. వీరిద్దరూ జంటగా నటించిన గీతగోవిందం సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటినుండి వీరి ప్రేమను కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అలా వీరి కాంబోలో గీత గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా కూడా వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకుంది. అప్పటినుంచి వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరగడం, వెకేషన్ లకి వెళ్లడం, అటు బహిరంగ ప్రదేశాలలో కూడా కలిసి కనిపించడం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు తమ బంధాన్ని బయట పెట్టలేదు. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా రాబోతోంది. మరి ఈ జంట తమ బంధాన్ని ఏకంగా పెళ్లితోనే ప్రకటిస్తారేమో చూడాలి.