Begin typing your search above and press return to search.

త్రిష విజయ్.. 'పుష్ప 2' మీమ్ ఫుల్ వైరల్..

తమిళనాడులో ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతున్న వేళ, కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ భారీ చర్చకు దారి తీసింది.

By:  M Prashanth   |   4 May 2026 3:17 PM IST
త్రిష విజయ్.. పుష్ప 2 మీమ్ ఫుల్ వైరల్..
X

తమిళనాడులో ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతున్న వేళ, కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ భారీ చర్చకు దారి తీసింది. రెండేళ్ల క్రితం ఆయన స్టార్ట్ చేసిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా లీడ్‌ లో కొనసాగుతుండటంతో విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ వైరల్ అవుతోంది.

అయితే నేడే ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. దీంతో విజయ్ లీడ్‌ ను ఆమె బర్త్‌ డేతో కలిపి లింక్ చేసి అభిమానులు మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది త్రిషకు బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజయ్- త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారంలో ఉన్న రూమర్స్ కూడా ఆ ట్రెండ్‌ కు మరింత ఊపునిచ్చాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒక పెద్ద మీమ్ ఫెస్టివల్‌ లా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ మూవీ రిఫరెన్స్‌ లతో మీమ్స్ హోరెత్తుతున్నాయి. సినిమాలో హీరో సీఎం చేసే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ, త్రిష బర్త్‌ డే రోజునే విజయ్ సీఎం అవ్వడం సినిమా సీన్‌ లా ఉందంటూ అనేక మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నెట్టింట మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు.

పుష్ప 2లో ఒక డైలాగ్‌ ను తీసుకుని మరింత క్రియేటివిటీ చూపిస్తున్నారు నెటిజన్లు. సినిమాలో సీఎం చేసే తేదీ గురించి రావు రమేష్ అడిగితే, ఆ రోజు శ్రీవల్లి బర్త్‌ డే అని హీరో చెప్పే సన్నివేశాన్ని పోల్చుతూ.. "ఇవాళ త్రిష బర్త్‌ డే కాబట్టి విజయ్ లీడ్‌ లోకి వచ్చారు" అంటూ సరదాగా పోస్టులు చేస్తున్నారు. ఆ మీమ్స్ పుల్ వైరల్ అవుతూ ఇప్పుడు ట్రెండింగ్‌ లో నిలుస్తున్నాయి.

ఇక రాజకీయంగా చూస్తే, విజయ్ పార్టీ మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగడం, అదే సమయంలో మంచి లీడ్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది కేవలం సినీ ఫ్యాన్స్‌ కే కాదు, పొలిటికల్ ఎక్స్పెర్ట్స్ కు కూడా ఆసక్తికర అంశంగా మారింది. సినిమా నుంచి రాజకీయాలకు మారిన నాయకుల్లో విజయ్ కూడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమా, రాజకీయాలు, తమిళ కల్చర్ అన్నీ కలిసి ఒకేసారి ఇలా ట్రెండ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. త్రిష బర్త్‌ డే, విజయ్ పొలిటికల్ లీడ్, పుష్ప 2 మీమ్స్.. ఈ మూడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అభిమానులు ఆ సందర్భాన్ని తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం విజయ్ విన్నింగ్ ఫీలింగ్ ఇప్పటికే కనిపిస్తోంది. అదే సమయంలో త్రిష పుట్టినరోజు ఆ వేడుకకు మరింత జోష్ తీసుకువచ్చింది.