పవిత్ర - నరేష్ బంధంపై విజయ్ కృష్ణ ఊహించిన కామెంట్స్!
పవిత్ర లోకేష్ గురించి విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఆమె అందరితో చాలా త్వరగా కలిసిపోతారని తెలిపారు. "ఆమె నాతో రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు.
By: Madhu Reddy | 22 Feb 2026 9:00 AM ISTసీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌ల బంధం గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్‌పై రకరకాల చర్చలు నడుస్తున్న తరుణంలో, నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర తమ ఇంట్లో ఎలా ఉంటారు? తండ్రి నరేష్ వ్యక్తిత్వం ఎలాంటిది? అనే విషయాలపై విజయ్ కృష్ణ చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
ఇంట్లో పవిత్ర ప్రవర్తన ఇలా ఉంటుంది:
పవిత్ర లోకేష్ గురించి విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఆమె అందరితో చాలా త్వరగా కలిసిపోతారని తెలిపారు. "ఆమె నాతో రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు. మా నాన్న ఆవిడ ముందు కొంచెం సైలెంట్ గా ఉంటారు. నిజం చెప్పాలంటే, 56 ఏళ్ల వయసులో కూడా నాన్న ఇప్పుడు ఇంత కామ్ గా, ప్రశాంతంగా ఉన్నారంటే అది పవిత్ర వల్లే" అని విజయ్ చెప్పుకొచ్చారు. ఇక పవిత్ర రాకతో తమ ఇంట్లో ఒక పాజిటివ్ మార్పు వచ్చిందని, తండ్రి సంతోషంగా ఉండటం చూస్తుంటే తనకు ఆనందంగా ఉందని ఆయన మనసు విప్పి మాట్లాడారు.
కృష్ణ , నానమ్మల అంగీకారం ఉందా?
నరేష్ - పవిత్రల బంధం గురించి సూపర్ స్టార్ కృష్ణ బ్రతికున్నప్పుడే అంగీకరించారా? అన్న ప్రశ్నకు విజయ్ కృష్ణ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "అవును, మా తాతగారికి (కృష్ణ), నానమ్మకు మా నాన్న తీసుకునే ఏ నిర్ణయమైనా ఇష్టమే. నాన్న దేని గురించి చెప్పినా వారు అంగీకరించేవాళ్లు" అని స్పష్టం చేశారు. పెద్దల ఆశీస్సులు ఉన్నాయని విజయ్ చెప్పడంతో ఈ బంధంపై ఉన్న అనేక అనుమానాలకు తెరపడినట్లయింది. తండ్రి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ గౌరవిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
నాన్న మల్టీ టాలెంటెడ్.. నేను నేర్చుకోవాలి:
తన తండ్రి నరేష్ గురించి విజయ్ కృష్ణ గొప్పగా చెప్పుకొచ్చారు. "నాన్న చాలా మల్టీ టాలెంటెడ్. ఆయన అన్ని పనులను ఒకేసారి పూర్తి చేయగలరు. ముఖ్యంగా ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ తన పనిని పూర్తి చేసే విధానం నాకు చాలా ఇష్టం. ఇక నేను ఆయన నుండి అది నేర్చుకోవాలి అనుకున్నా.. నాకు రాదు, ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని" అని విజయ్ వివరించారు. నాన్న ఒకేసారి ఎన్నో టాస్క్ లు కంప్లీట్ చేస్తారని, ఆయన పని పట్ల ఉన్న అంకితభావం తనని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ల బంధంపై బయట ఎన్ని విమర్శలు ఉన్నా, సొంత కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా కుమారుడు విజయ్ కృష్ణ ఇంత పాజిటివ్‌గా స్పందించడం విశేషం. తండ్రి సంతోషమే పరమావధిగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
