నాలుగేళ్లకు మళ్లీ ధూమ్ డైరెక్టర్ తెరపైకి!
‘ధూమ్ 3’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో భారీ యాక్షన్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని, ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
By: Srikanth Kontham | 16 Nov 2026 4:00 AM ISTబాలీవుడ్‌లో `ధూమ్ 3` వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారు. 2023లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` తర్వాత ఆచార్య మరే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ తదుపరి సినిమా కోసం భారీ స్పాన్ ఉన్న ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ముందుకు రావడం విశేషం. గతంలో ఇదే బ్యానర్‌లో `టషాన్`, `ధూమ్ 3`, `థగ్స్ ఆఫ్ హిందుస్తాన్` వంటి భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించిన విజయ్ మరోసారి హోమ్ బ్యానర్‌తో చేతులు కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతిపెద్ద స్పాన్ హై-వోల్టేజ్ యాక్షన్ అంశాలతో సినిమా రూపొందనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కథానాయకుడిగా ఎవరు నటిస్తారనే అంశంపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.
కథకున్న డిమాండ్.. సినిమా స్కేల్ దృష్ట్యా స్టార్ హీరోను పాత్ర కోసం ఎంపిక చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని.. త్వరలోనే హీరో ఎంపికపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులతో `థగ్స్ ఆఫ్ హిం దుస్తాన్` వంటి భారీ ప్రయోగం చేసిన విజయ్ కృష్ణ ఆచార్య ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సెలెక్టివ్‌గా మారారు.
ఆ తర్వాత వచ్చిన `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్క కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో కొత్త స్క్రిప్ట్‌పై మూడేళ్లుగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ విజయ్ అచ్చొచ్చిన యాక్షన్ అండ్ మాస్ జానర్‌లోకి విక్టర్ అడుగు పెడుతుండటంతో ఆసక్తి నెలకొంది. యశ్ రాజ్ ఫిలింస్ వంటి దిగ్గజ సంస్థ తోడవడంతో సినిమా బడ్జెట్.. మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విజువల్ వండర్‌లో నటించే స్టార్ హీరో ఎవరో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
