Begin typing your search above and press return to search.

సీఎం అయ్యాక విజయ్ ఫస్ట్ బర్త్ డే.. చర్చంతా దానికోసమే..

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బర్త్ డేను ఆయన ఫ్యాన్స్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

By:  M Prashanth   |   23 Jun 2026 12:00 AM IST
సీఎం అయ్యాక విజయ్ ఫస్ట్ బర్త్ డే.. చర్చంతా దానికోసమే..
X

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బర్త్ డేను ఆయన ఫ్యాన్స్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి బర్త్‌ డే సెలబ్రేషన్స్ కంటే ఆయన నటించిన చివరి మూవీ జననాయగన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎన్నో నెలలుగా సెన్సార్ సమస్యలతో వార్తల్లో నిలుస్తున్న ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నకు ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ రాలేదు.

నిజానికి జననాయగన్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే చివరి దశలో సెన్సార్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. 2025 డిసెంబర్‌లో చిత్రాన్ని సెన్సార్ బోర్డుకు పంపగా, తొలుత యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తూ కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం.

మూవీ టీమ్ ఆ మార్పులు పూర్తి చేసి మళ్లీ సమర్పించినప్పటికీ పర్మిషన్ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా సినిమాపై కొన్ని కంప్లైంట్లు వచ్చాయని, దానిని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సినిమా ఫ్యూచర్ పెద్ది క్వశ్చన్ మార్క్ గా మారింది. తర్వాత ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కానీ ఆ తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా మూవీ టీమ్ కు అనుకూలంగా మారలేదు. ఇదే సమయంలో ఎన్నికల హడావిడి, సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఇంటర్నెట్‌ లో లీక్ కావడం వంటి పరిణామాలు మూవీ యూనిట్‌ కు మరో ఎదురుదెబ్బగా మారాయి. ఈ క్రమంలో విజయ్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ జననాయగన్ విడుదల మాత్రం ముందుకు సాగలేదు.

సినిమా ఆలస్యం కావడంతో డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన పెరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వాలని విజయ్ నిర్మాతలకు సూచించినట్లు వార్తలు వినిపించాయి. అవసరమైతే తన రెమ్యూనరేషన్‌ ను కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే నిర్మాతలు మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి వస్తే వెంటనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.

అందుకే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి రాకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కించిన ఆ చిత్రం ప్రారంభం నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి పెద్ద సమస్యలు ఎదుర్కోలేదని అంటున్నారు. కానీ సెన్సార్ వ్యవహారమే ప్రధాన అడ్డంకిగా మారింది. రాజకీయ నేపథ్యం, ఎన్నికల సమయం, సినిమాలోని కొన్ని సీన్స్ పై వచ్చిన అభ్యంతరాలు ఆ పరిస్థితికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఆరు నెలలుగా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న జననాయగన్ టీమ్ ఇప్పటికీ ఆశలు వదులుకోలేదు. నిర్మాత వెంకట్ నారాయణన్ పర్మిషన్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నిర్ణయం వస్తుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. అయితే విజయ్ బర్త్‌ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తో నింపేస్తున్నారు. అయితే ఆ పోస్టులన్నింటిలోనూ ఒకే ప్రశ్న ఎక్కువగా కనిపిస్తోంది. అదే.. జననాయగన్ ఎప్పుడు విడుదల అవుతుందనేది. ప్రస్తుతం అభిమానుల ఫోకస్ అంతా ఆ సినిమాపైనే ఉంది.