విజయ్ మూవీ పరిస్థితి మరీ దారుణంగా మారిందా?
అయితే ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో సినిమాకు గుడ్ బై చెబుతూ ఆయన చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు.
By: Tupaki Entertainment Desk | 10 Jan 2026 2:59 PM ISTదళపతి విజయ్.. కోలీవుడ్ బాక్సాఫీస్‌ని శాసించిన హీరో. రజనీకాంత్ తరువాత తమిళనాట రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న విజయ్ రికార్డు సాధించాడు. అయితే ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో సినిమాకు గుడ్ బై చెబుతూ ఆయన చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు. సెన్సార్ డిలే కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదాపడిన విషయం తెలిసిందే.
మద్రాస్ హైకోర్టుకు మేకర్స్ వెళ్లినా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో మేకర్స్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మాద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డ్ అప్పీల్‌కు వెళ్లడంతో `జన నాయగన్` రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. 21న మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో నిర్మాత కె. నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తున్నాయి. విజయ్ చివరి సినిమా. గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేశాం. కానీ ఈ వివాదాల మధ్య అది చాలా కష్టమైందన్నారు. దశాబ్దాల పాటు అభిమానుల్ని, సినీ లవర్స్‌ని అలరించిన విజయ్‌కి సినిమాల నుంచి గ్రాండ్‌గా వీడ్కోలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు.
అంతే కాకుండా ప్రస్తుత పరిస్థితి తమ చేయిదాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఏం జరిగిందో వివరించారు. షూటింగ్ పూర్తయిన తరువాత సినిమాను గత ఏడాది డిసెంబర్ 18న సెన్సార్ బోర్డ్‌కు పంపించాం. డిసెంబర్ 22న ఈ మూవీకి U/ A సర్టిఫికెట్ జారీ చేస్తామని మాకు ఈమెయిల్ వచ్చింది. కొన్ని మార్పులు సూచించారు. వారు చెప్పిన మార్పులు చేసి మళ్లీ సెన్సార్‌కు పంపించాం. మేము రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ..సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, దీన్ని రివిజన్ కమటీకి పంపిస్తున్నామని జనవరి 5న ఈమెయిల్ వచ్చింది.
రివిజన్ కమిటీని సంప్రదించడానికి మా వద్ద సమయం లేకపోవడం, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో మాకు స్పష్టత లేకపోవడంతో మేం చేసేది లేక హైకోర్టుని ఆశ్రయించాం` అన్నారు. హీరో దళపతి విజయ్ గురించి మాట్లాడుతూ `ఇది చాలా విపత్కర సమయమని నిర్మాత వెంకట్ కె. నారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. `జన నాగయన్` రిలీజ్ గందరగోళ పరిస్థితిలో పడింది. తమిళనాడులో ఎన్నికలు ఉండటంతో ఈ ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారింది. ఈ సినిమా కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వారికి కృతజ్ఞతలు. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన విజయ్ కోసం ఈ సినిమా సరైన సమయానికి అందించాలనుకున్నా.
కానీ కుదరలేదు. ఈ విషయంలో అసౌకర్యానికి గురైన అభిమానులకు, పంపిణీదారులకు నేను క్షమాపణ చెబుతున్నా. చట్టపరమైన సమస్యల కారణంగా `జన నాయగన్` రిలీజ్ మా చేయి దాటిపోయింది` అని చెప్పుకొచ్చారు నిర్మాత. విజయ్ రాజకీయ ఎంట్రీ కారణంగానే ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోలీవుడ్ వర్గాలు వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సెకండ్ హాఫ్‌లో కొన్ని మార్పులు చేసి పొలిటికల్ మసాలా దట్టించడంతో తాజా వివాదానికి కారణం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
