జననాయగన్‌లో లాస్ట్ మినిట్ సర్‌ప్రైజ్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సినీ ప్రయాణంలో జననాయగన్‌కు ప్రత్యేస్థానం ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 17 July 2026 3:51 PM ISTకోలీవుడ్ స్టార్ విజయ్ సినీ ప్రయాణంలో జననాయగన్‌కు ప్రత్యేస్థానం ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సినిమా ఆయన రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి సారించే ముందు చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ ప్రతి చిన్న అప్డేట్‌ను కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు సినిమాలో కొత్త సాంగ్ ను జోడించారన్న ప్రచారం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అఫీషియల్ గా ఎలాంటి వివరాలు బయటకు రానప్పటికీ, ఈ డెసిషన్ వెనుక ఏదైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
సాధారణంగా సినిమా ఫైనల్ కట్ లాక్ అయిన తర్వాత ఇలాంటి మార్పులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఈ కొత్త సాంగ్ కేవలం మరో కమర్షియల్ సాంగ్ కాదేమో, కథలో కీలకమైన ఎమోషనల్ మూమెంట్ ను మరింత బలంగా చూపించేందుకు చేర్చి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ సినీ కెరీర్‌కు ఫేరెవల్ మూవీగా భావిస్తున్న నేపథ్యంలో, ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్లే ముందు గుర్తుండిపోయే ఎమోషనల్ మూమెంట్‌ను ఇవ్వాలనే ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇంకొందరు ఈ కొత్త సాంగ్ క్లైమాక్స్‌కు ముందు మాంటేజ్ రూపంలో వస్తుందా? లేక సినిమా ముగిసిన తర్వాత ఎండ్ క్రెడిట్స్‌పై స్పెషల్ ట్రిబ్యూట్‌లా ప్లే అవుతుందా? అనే డౌట్స్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయి. గతంలో కొన్ని పెద్ద సినిమాలు కూడా క్లైమాక్స్ లో ఎమోషన్ ను మరింత పెంచేందుకు ఇలాంటి పాటలను ఉపయోగించాయి. అదే తరహా ఎమోషనల్ టచ్‌ను జననాయగన్‌లో కూడా ప్లాన్ చేసి ఉండొచ్చని సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో వస్తున్న చివరి సినిమా కావడంతో, ఈ సాంగ్‌లో ఏదైనా ప్రతీకాత్మక సందేశం దాగి ఉంటుందా? ప్రజలతో ఆయన అనుబంధాన్ని గుర్తు చేసే విజువల్స్ లేదా ఫ్యూచర్ పొలిటికల్ జర్నీని సూచించే భావాలుంటాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం కేవలం అభిమానుల అంచనాలు, సోషల్ మీడియా డిస్కషన్సే తప్ప అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇప్పటికే జననాయగన్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు. అలాంటి సమయంలో లాస్ట్ మినిట్ లో మరో సాంగ్ యాడ్ అయిందనే వార్త అంచనాలను మరింత పెంచింది. ఇది నిజంగానే విజయ్ సినీ ప్రయాణానికి భావోద్వేగ వీడ్కోలు పలికే ట్రాక్‌గా నిలుస్తుందా? లేక కథలో కీలక మలుపును మరింత ప్రభావవంతంగా చూపించే భాగమా? అన్నది జూలై 23న సినిమా రిలీజైన తర్వాతే తేలనుంది. అప్పటి వరకు ఈ కొత్త పాట చుట్టూ వినిపిస్తున్న ఊహాగానాలే జననాయగన్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
