Begin typing your search above and press return to search.

జన నాయగన్.. ఇదే అతిపెద్ద టెన్షన్!

తమిళనాడులో ఎన్నికల హడావుడి ముగిసింది. ఏకంగా 85 శాతం పోలింగ్ నమోదవ్వడంతో అందరి చూపు ఇప్పుడు మే 4న రాబోయే ఫలితాల వైపు మళ్ళింది.

By:  M Prashanth   |   24 April 2026 10:54 PM IST
జన నాయగన్.. ఇదే అతిపెద్ద టెన్షన్!
X

తమిళనాడులో ఎన్నికల హడావుడి ముగిసింది. ఏకంగా 85 శాతం పోలింగ్ నమోదవ్వడంతో అందరి చూపు ఇప్పుడు మే 4న రాబోయే ఫలితాల వైపు మళ్ళింది. అయితే ఈ రిజల్ట్ కేవలం రాజకీయ పార్టీలకే కాదు, దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు కూడా చాలా కీలకం. విజయ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇదే ఆయన చివరి సినిమా కావడంతో, ఎన్నికల ఫలితాలు ఈ మూవీ బాక్సాఫీస్ భవిష్యత్తును ఎలా మారుస్తాయనే టెన్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది.

అసలు విషయం ఏంటంటే, ఈ ఎన్నికల్లో విజయ్ గెలిస్తే ‘జన నాయగన్’ రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. పొలిటికల్ విక్టరీ తర్వాత వచ్చే సినిమా కాబట్టి థియేటర్ల దగ్గర వాతావరణం పండగలా ఉంటుంది. కలెక్షన్ల రికార్డులు బద్దలవ్వడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఫలితం తారుమారైతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఓటమి వల్ల ఫ్యాన్స్ లో నిరాశ ఏర్పడితే, ఆ ప్రభావం నేరుగా సినిమా వసూళ్లపై పడే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

అయితే తమిళనాడులో సెంటిమెంట్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఒకవేళ విజయ్ ఓడిపోయినా, ‘మన హీరోకి ఇదే చివరి సినిమా.. సపోర్ట్ చేద్దాం’ అనే సింపతీ ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి స్టార్ల విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్స్ పనిచేశాయి. కాకపోతే రాజకీయ ప్రత్యర్థుల నుంచి నిరసనలు ఎదురైతే థియేటర్ల దగ్గర గొడవలు జరిగే రిస్క్ ఉంటుంది. షోలు క్యాన్సిల్ అయితే మాత్రం నిర్మాతలకు కోట్లలో నష్టం తప్పదు.

అందుకే మే 4 వరకు ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పొలిటికల్ టెన్షన్‌కు తోడు ‘జన నాయగన్’ టీమ్‌ను పైరసీ దెబ్బ మరోవైపు వేధిస్తోంది. సౌండ్ మిక్సింగ్, డిఐ పనులతో ఉన్న ఫుల్ ప్రింట్ నెట్టింట లీక్ అవ్వడం మేకర్స్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే పోలీసులు కొందరిని అరెస్ట్ చేసినా కాపీలు మాత్రం ఆగడం లేదు. ఈ లీక్ వల్ల కనీసం 30 శాతం వసూళ్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో థియేట్రికల్ రన్ ఎంత బాగుంటే అంత సేఫ్ అని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే రిలీజ్ ప్లానింగ్ మొత్తం ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. విజయ్ రాజకీయ జీవితంతో పాటు సినీ కెరీర్ ముగింపు కూడా ఈ మే 4 రిజల్ట్‌తోనే ముడిపడి ఉంది. గెలిస్తే ఒక లెక్క.. ఓడితే మరో లెక్క అన్నట్లుగా ‘జన నాయగన్’ పరిస్థితి తయారైంది. సెన్సార్ పనులు, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అన్నీ ఆ రోజు తర్వాతే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.