కోర్టు తీర్పు వచ్చేసింది..కానీ..!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన భారీ పొలిటికల్ ఎమోషనల్ థ్రిల్లర్ 'జన నాయగన్'. హెచ్.వినోద్ దర్శకుడు.
By: Tupaki Entertainment Desk | 9 Jan 2026 11:38 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన భారీ పొలిటికల్ ఎమోషనల్ థ్రిల్లర్ 'జన నాయగన్'. హెచ్.వినోద్ దర్శకుడు. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి'కిది రీమేక్. పూర్తి స్థాయిలో కాకుండా 70 శాతం వరకు ఈ మూవీనే తీసుకుని చేసినట్టుగా రీసెట్‌గా విడుదలైన ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 9న శుక్రవారం భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో వివాదం తలెత్తడం, సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మేకర్స్ మద్రాస్ హై కోర్ట్‌ను ఆశ్రయించడం తెలిసిందే.
సెన్సార్ బోర్డ్ తరుపున సొలిసిటర్ జనరల్, మేకర్స్ తరుపున పరాశరన్ వాదనలు వినిపించడంతో తీర్పుని రిజర్వ్ చేసిన మద్రాస్ న్యాయమూర్తి శుక్రవారం తుది తీర్పుని వెలువరించారు. విజయ్ నటించిన 'జన నాయగన్'ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సెంట్రల్ బోర్డ్ షర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికెట్‌ను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలన్న సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్ నిర్ణయాన్ని తోసిపుచ్చిఈ సినిమాకు UA16+ సర్టిఫికెట్ అందజేయాలని జస్టీస్ పీటీ ఆశా బోర్డును ఆదేశించారు.
జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు థియేట్రికల్ విడుదల కోసం సర్టిఫికెట్ జారీ చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించి ఎల్ ఎల్‌పీని దాఖలు చేసింది. దీనిపై తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది విజయ్ విక్టరీ అని నెట్టింట సందడి చేస్తున్నారు. డిసెంబర్ 18న సినిమాను సెన్సార్ కోసం పంపించినప్పుడు సదరు బోర్డ్ సూచించిన కట్స్‌ని, మార్పులని చేసిన తిరిగి సమర్పించామని, అయినా బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం చేస్తోందని ఈ సందర్భంగా న్యాయస్థానానికి నిర్మాత తెలియజేశారు.
సీబీఎఫ్‌సీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఏ..ఆర్.ఎల్. సుందరేశన్, సినిమా చూసిన ఐదుగురు కమిటీ సభ్యులలో ఒకరు ఫిర్యాదు చేశారని, కమిటీ UA16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడానికి ముందు తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని నిర్మాత పేర్కొన్నారు. తాజా ఫిర్యాదు దృష్ట్యా సీబీఎఫ్‌సీ చైర్ పర్సన్ సినిమాటోగ్రాఫ్ రూల్స్, 2024 యాక్ట్ ప్రకారం తన అధికారాలను ఉపయోగించి 'జన నాయగన్' మూవీని రివైజింగ్ కమిటీకి పంపారని ప్రొడక్షన్ కంపనీ తరుపు లాయర్ న్యాయమూర్తికి తెలిపారు.
ఈ వాదనని వ్యతిరేకిస్తూ నిర్మాత తరుపున సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్, మెజారీ సభ్యులు సర్టిఫికెట్ జారీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం ఒకే ఒక్క కమిటీ సహ్యుడి అభ్యంతరాలను ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే 27 మార్పులు చేశారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ఇరువురి వాదనలు విన్న హై కోర్టు న్యాయమూర్తి `జ.న నాయగన్` రిలీజ్‌కు అనుమతిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగిల్ జడ్జ్ తీర్పుపై సీబీఎఫ్‌సీ అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్ ఎల్ సుందరేషన్ అప్పీలుకు వెళుతున్నారు. దీంతో 'జన నాయగన్' సెన్సార్ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
