Begin typing your search above and press return to search.

'జ‌న నాయ‌గ‌న్‌' లీక్స్‌లో బిగ్ ట్విస్ట్‌..ఏం జ‌రిగింది?

ఇదిలా ఉంటే `జ‌న నాయ‌గ‌న్‌` లీక్స్‌పై బిగ్ ట్విస్ట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి.

By:  Ravindar Gorantla   |   11 April 2026 5:01 PM IST
జ‌న నాయ‌గ‌న్‌ లీక్స్‌లో బిగ్ ట్విస్ట్‌..ఏం జ‌రిగింది?
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` విష‌యంలో ఏం జ‌రుగుతోంది? అస‌లు లీకులు ఎలా మొద‌ల‌య్యాయి?..దీని వెనుక ఎవ‌రున్నారు? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా, `ప్రేమ‌లు` ఫేమ్ మ‌మితా బైజు కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా హెచ్‌. వినోద్ తెర‌కెక్కించిన మూవీ `జ‌న నాయ‌గ‌న్‌`. తెలుగు సూప‌ర్ హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో విజ‌య్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు, చేర్పులు చేసి దీన్ని రూపొందించారు.

బాబి డియోల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సింది. అయితే సెన్సార్ వివాదం కార‌ణంగా సినిమా చివ‌రి నిమిషంలో వాయిదా ప‌డింది. ఆ త‌రువాత మేక‌ర్స్ సీబీఎఫ్‌సీకి వ్య‌తిరేకంగా చెన్నై కోర్టుని ఆశ్ర‌యించ‌డం..ఆ త‌రువాత సినిమాని రివైజింగ్ క‌మిటీకి పంపించ‌డం జ‌రిగింది. అక్క‌డి నుంచి సినిమా నెల‌ల త‌ర‌బ‌డి వాయిదాప‌డుతూ వ‌స్తోంది. గ‌త నాలుగు నెల‌లుగా సినిమా రిలీజ్‌పై ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు. దీంతో సినిమా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలోనే సినిమాకు సంబంధించిన సీన్‌లు లీక్‌కు గురి కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దీనిపై ప‌లువురు సెల‌బ్రిటీలు స్పందించి హీరో విజ‌య్‌కి, నిర్మాణ సంస్థ‌కు త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. క‌మ‌ల్ హాస‌న్ లాంటి న‌టులు కూడా లీకుల‌పై తీవ్ర స్థాయిలో స్పందించి ఇది వ్య‌స్థ వైఫ‌ల్యం అంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే `జ‌న నాయ‌గ‌న్‌` లీక్స్‌పై బిగ్ ట్విస్ట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి.

ఈ మూవీ సెన్సార్ వివాదం స‌మ‌యంలో మేక‌ర్స్ సెన్సార్ వారు చెప్పిన మార్పుల్ని చేసి కొత్త వెర్ష‌న్‌ని సెన్సార్ క‌మిటీకి స‌మ‌ర్పించారు. అదే స‌మ‌యంలో ఎడిటింగ్ స్టేజ్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన లీకులు జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ఓ సీన్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంద‌ని, అయితే ఆ వీడియోలో ఉన్న వాట‌ర్ మార్కు ద్వారా ఇది ఎడిటింగ్ స్టేజ్‌లోనే లీక్ అయినట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎడిటింగ్ ద‌శ‌లోనే లీక్ కావ‌డంతో అందుకు బాధ్యులైన ఐదుగురుని రీసెంట్‌గా పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఐదుగురు నిందితులే `జ‌న నాయ‌గ‌న్‌`కు సంబంధించిన సీన్స్‌ని సోష‌ల్ మీడియాలో లీక్ చేశార‌ని ఇన్ సైడ్ టాక్‌. తాజా వివాదాన్ని మేక‌ర్స్ సీరియ‌స్‌గా తీసుకుని చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌తో పాటు మేక‌ర్స్‌కి కోలీవుడ్ స్టార్స్ అండ‌గా నిలుస్తుండ‌టం గ‌మ‌నార్హం.