Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్ : స్టార్ హీరో విడాకుల వార్త‌ల న‌డుమ న‌టి కామెంట్!

సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను దళపతి విజయ్ - సంగీత దంప‌తుల‌ విడాకుల వార్తలకు లింక్ చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   28 Feb 2026 9:55 AM IST
త్రోబ్యాక్ : స్టార్ హీరో విడాకుల వార్త‌ల న‌డుమ న‌టి కామెంట్!
X

ద‌ళ‌ప‌తి విజయ్ విడాకుల వార్తల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాల్లో ప్ర‌ముఖ హీరోయిన్‌తో ఎఫైర్ వార్త‌లు ప్ర‌ధానంగా హైలైట్ అవుతున్నాయి. అంతేకాదు పాత ఇంట‌ర్వ్యూల‌లో కోలీవుడ్ ఫిలిం జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌ద‌రు హీరోయిన్‌ స్పందించిన విధానంపైనా ఇప్పుడు షార్ట్ వీడియోలు తామ‌ర‌తంప‌ర‌గా వైర‌ల్ అయిపోతున్నాయి.

అలాంటి ఒక వీడియో క్లిప్ లో యాంకర్ ప్రశ్న కు ఆ హీరోయిన్ సమాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ వైరల్ వీడియో ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్. అందులో యాంకర్ హీరోయిన్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ``మీరు ఒకరిని ప్రేమిస్తున్నారు.. కానీ ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిపోయింది.. అప్పుడు మీ నిర్ణయం ఏంటి? ఆ ప్రేమను కొనసాగిస్తారా లేదా వదిలేస్తారా?`` అని ఆ యాంకర్ త‌మిళంలో ప్ర‌శ్నించారు.

దానికి ఆ హీరోయిన్ మొండి సమాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స‌ద‌రు హీరోయిన్ చాలా స్పష్టంగా.. మొండిగా సమాధానం ఇచ్చారు. ట్యాలెంటెడ్ క‌థానాయిక‌ ఏమన్నారంటే - ``క‌చ్ఛితంగా ఆ ప్రేమను కొనసాగిస్తాను.. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు.. అతడికి పెళ్లయిందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. నా ప్రేమ నిజమైనదైతే నేను వెనక్కి తగ్గను`` అని వ్యాఖ్యానించారు.

విజయ్ విడాకుల వార్తలతో కనెక్షన్ ఉందా?

సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను దళపతి విజయ్ - సంగీత దంప‌తుల‌ విడాకుల వార్తలకు లింక్ చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారని.. వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. సంగీత కోర్టుకు వెళ్ల‌డంతో ఇవి నిజ‌మేన‌ని న‌మ్ముతున్నారు. విజయ్ తన రాజకీయ పార్టీ (టివికే) ప్రకటన సమయంలో కానీ.. ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో కానీ సంగీత ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో విజయ్ - టాప్ హీరోయిన్ మధ్య ఏదో ఉందనే పుకార్లు (ముఖ్యంగా `లియో` సినిమా తర్వాత) ఎక్కువయ్యాయి. ఆ హీరోయిన్ చెప్పిన పాత సమాధానం ఇప్పుడు విజయ్ ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

అయితే వీడియోలో స‌ద‌రు హీరోయిన్ వ్యాఖ్య‌ల‌ను అనుస‌రించి నెటిజ‌నులు ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ముందే ఇలాంటి మనస్తత్వంతో ఉన్నావు కాబట్టే.. ఇప్పుడు విజయ్ జీవితంలోకి వెళ్తున్నావు! అనే అర్థంలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ స‌ద‌రు స్టార్ హీరోయిన్ గతంలో ప‌లు హిట్ సినిమాల్లో నటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ జంటగా నటించాక‌ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు కోలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. అయితే వీరిద్దరూ దీనిపై అధికారికంగా స్పందించలేదు. స‌ద‌రు హీరోయిన్ మాత్రం త‌న‌పై కామెంట్లు చేసే వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. విజ‌య్ అభిమానులు ఇదంతా ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీ ల కుట్ర అని కొట్టి పారేస్తున్నారు.

ఇప్పటివరకు విజయ్ కానీ, సంగీత కానీ విడాకుల గురించి లేదా కోర్టు కేసుల గురించి ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రవేశం, వ్యక్తిగత జీవితంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వీడియోను బయటపెట్టడం ద్వారా ఆ న‌టిని టార్గెట్ చేస్తున్నారు.