Begin typing your search above and press return to search.

విజయ్ ఫ్యామిలీ లైఫ్.. అభిమాని మోకాళ్ల యాత్ర? నిజమేనా?

ఆ వీడియో వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు.

By:  M Prashanth   |   6 March 2026 6:36 PM IST
విజయ్ ఫ్యామిలీ లైఫ్.. అభిమాని మోకాళ్ల యాత్ర? నిజమేనా?
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే. విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ పిటిషన్‌ లో పలు ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఓ నటితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్‌ గా మారింది. అందులో ఒక వ్యక్తి చేతిలో విజయ్, సంగీత దంపతులు కలిసి దిగిన ఓ పాత ఫొటో పట్టుకుని మోకాళ్లపై నడుస్తూ కనిపిస్తున్నాడు. అతడి పక్కనే ఒక మహిళ కూడా నడుస్తూ సహాయం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సమాచారం ప్రకారం.. మోకాళ్లపై నడుస్తున్న వ్యక్తి పేరు విశ్వ అని, పక్కన కనిపిస్తున్న మహిళ ఆయన భార్య మీనాక్షి అని చెబుతున్నారు. ఆ దంపతులు విజయ్ కు పెద్ద అభిమానులని తెలుస్తోంది. తమ అభిమాన హీరో కుటుంబ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారని సమాచారం. మోకాళ్లపై నడుస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

ఆ వీడియో వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అభిమానుల ప్రేమకు ఇది నిదర్శనమని చెబుతుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీల కోసం ఇలాంటి పనులు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది నిజంగా అభిమానుల డెడికేషన్ ను చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో విజయ్, సంగీత దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయా అన్న అంశం కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విడాకుల పిటిషన్ దాఖలు చేశారనే వార్తలు ఇప్పటికే రావడంతో ఆ వీడియో మరింత వైరల్ అవుతోంది. అభిమానులు తమ హీరో కుటుంబ జీవితం సవ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలా ప్రార్థనలు చేస్తున్నారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఆ రెండు అంశాలపై కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. చెంగల్పట్టు కోర్టులో సంగీత ఏమని పిటిషన్ చేసింది? వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న వారు నిజంగా మెకాళ్ల ప్రార్థనలు చేస్తున్నారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు, అలాగే అభిమానులు చేసిన ప్రత్యేక ప్రార్థనల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం వచ్చే వరకు ఆ వార్తలను రూమర్లుగానే చూడాలని పలువురు సూచిస్తున్నారు.