Begin typing your search above and press return to search.

విజయ్ పై భార్య సంగీత పెట్టిన సెక్షన్ ఏంటో తెలుసా?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంగీత తన పిటీషన్ ను ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27 (1)(A), సెక్షన్ 27(1)(B), సెక్షన్ 27 (1) (D) ప్రకారం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

By:  Madhu Reddy   |   28 Feb 2026 12:11 PM IST
విజయ్ పై భార్య సంగీత పెట్టిన సెక్షన్ ఏంటో తెలుసా?
X

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నిజానికి కొంతమంది వివాహమైన మూడు, నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటే.. మరి కొంతమంది పెళ్లైన 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి , సంగీత సోర్నలింగం 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

1999 ఆగస్టు 25న విజయ్, సంగీత పెద్దలను ఒప్పించి ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కొడుకు , కూతురు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు విడాకులకు అప్లై చేశారంటూ వచ్చిన వార్త సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సినీ నటుడు విజయ్ దళపతి మరో సినీ నటితో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె విడాకులు కోరినట్లు తన పిటిషన్ లో పేర్కొన్నదట. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విజయ్ భార్య విజయ్ పై ఏకంగా కొన్ని సెక్షన్ల పైన కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంగీత తన పిటీషన్ ను ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27 (1)(A), సెక్షన్ 27(1)(B), సెక్షన్ 27 (1) (D) ప్రకారం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తన పిటీషన్ లో ఏకంగా ఏడు అభియోగాలు ఆమె మోపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వివాహేతర సంబంధం, ఆర్థిక ఆంక్షలు, నిర్లక్ష్యం మరియు పశ్చాతాపం లేకపోవడం, తీవ్ర మానసిక వేదన, వేధింపులు, స్వేచ్ఛాహరణం, రెండేళ్లుగా వేరుగా నివాసం ఇలా మొత్తం 7 అభియోగాలు విజయ్ పై సంగీత మోపినట్లు సమాచారం.

మరోవైపు ఏప్రిల్ 26న విచారణకు రావాలి అని కోర్టు విజయ్ కి సమన్లు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ఏం జరుగుతోంది అనే విషయం పూర్తిగా తెలియాలి అంటే ఏప్రిల్ 20 వరకు ఎదురు చూడాల్సిందే.. ఇకపోతే ఒకవైపు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తన పార్టీ టీవీకే ప్రచారంలో పాల్గొంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆయన భార్య విడాకులు కోరారు అంటూ వచ్చిన వార్త విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. విజయ్ కి ఒక కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్యా షాషా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ కొడుకు జాసన్ ప్రస్తుతం డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత విడాకులకు సిద్ధమవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.