విడాకుల కేసు.. విజయ్ సెటిల్మెంట్ కు రెడీ అయ్యారా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం అటు సినీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
By: M Prashanth | 4 March 2026 4:12 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం అటు సినీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన, రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీవీకే పార్టీకి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కుటుంబ వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన దాంపత్య జీవితానికి చెందిన విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది.
విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనం రేపింది. పలు కారణాల వల్ల తమ దాంపత్య జీవితం దెబ్బతిందని, ఇప్పటికే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక హీరోయిన్ తో విజయ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి.
సంగీత పిటిషన్ కు సంబంధించిన కోర్టు పత్రాలు బయటకు రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు డివోర్స్ ఇష్యూను కోర్టులో కంటే, బయట పరిష్కరించుకోవాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆ కేసు ప్రభావం పడకూడదనే దృష్టితో సెటిల్మెంట్ కు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు విజయ్ హాజరవుతున్నారని ఈ మధ్య వార్తలు రాగా.. ఇప్పుడు భారీ మొత్తంలో సంగీతకు భరణం ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం
జరుగుతోంది. సంగీతతోపాటు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దాదాపు రూ.250 కోట్ల సెటిల్మెంట్ ను విజయ్ ఆఫర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఆ మొత్తం సంగీతతో పాటు వారి ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్, దివ్య కోసం వినియోగించాలనే ఉద్దేశంతో ప్రతిపాదించారట.
అయితే ఆ మొత్తాన్ని ఎలా డివైడ్ చేస్తారు? ఎలాంటి నిబంధనలు ఉంటాయి? అనే విషయాలు బయటకు రాలేదు. అదే సమయంలో ఇప్పటికే పలుమార్లు విజయ్ ప్రతినిధులు సంగీతతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకవేళ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కు ఆమె అంగీకరిస్తే, పిటిషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీంతో విడాకుల వ్యవహారానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇక వారి ప్రేమకథ కూడా ఆసక్తికరమే. లండన్ లో పెరిగిన సంగీత, విజయ్ సినిమాలకు అభిమానిగా మారి, షూటింగ్ సెట్స్ లో ఆయన్ను కలవడం, అక్కడి నుంచి పరిచయం పెరిగి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1999 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. స్టార్ హీరో భార్య అయినప్పటికీ సంగీత ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండటం విశేషం. మరోవైపు విజయ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన చివరి చిత్రం జన నాయగన్ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
