Begin typing your search above and press return to search.

విజయ్- విక్రమ్.. ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదా?

ఇప్పుడు దాదాపు అంతా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ ఇటీవల స్త్రీ 2, ముంజ్యా, ఛావా వంటి సక్సెస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

By:  M Prashanth   |   14 Jun 2026 4:00 PM IST
విజయ్- విక్రమ్.. ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదా?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలిలో నటిస్తున్న విజయ్.. మరోవైపు రవి కిరణ్ కోలా, శౌర్యువ్ వంటి యంగ్ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్‌ గా మారాయి.

దర్శకుడు విక్రమ్ కె కుమార్‌ తో విజయ్ ఓ సినిమా చేయనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మనం, 24, గ్యాంగ్ లీడర్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన విక్రమ్ కుమార్.. గత కొంతకాలంగా ఓ స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ కథపై పని చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ స్టోరీని విజయ్‌ కు వినిపించగా, ఆయనకు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ ప్రాజెక్ట్ చుట్టూ మరింత ఆసక్తిని పెంచుతున్న అంశం బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ పేరు వినిపించడమే. ఇటీవల విజయ్ ముంబై వెళ్లి మ్యాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ లో నిర్మాతలను కలవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో దర్శకుడు విక్రమ్ కూడా ఆయనతో కలిసి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాజెక్టుకు మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు దాదాపు అంతా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ ఇటీవల స్త్రీ 2, ముంజ్యా, ఛావా వంటి సక్సెస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సంస్థ తెలుగు హీరోతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే ఆ వార్తల మధ్య విజయ్ అభిమానుల్లో మరో చర్చ మొదలైంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మొదట తెలుగు సినిమాగా ప్రారంభమైంది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడక్షన్ పార్టనర్ షిప్, స్క్రిప్ట్ మార్పులు, పాన్ ఇండియా రేంజ్ వంటి అంశాలతో సినిమా లెక్కలు మారిపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఆ అనుభవం తర్వాత విజయ్ మళ్లీ బాలీవుడ్ నిర్మాణ సంస్థల వైపు వెళ్లడని చాలామంది భావించారు. తెలుగు నిర్మాణ సంస్థలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు మ్యాడాక్ ఫిల్మ్స్‌ తో వర్క్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. లైగర్ తరహాలో మళ్లీ మిస్టేక్స్ జరుగుతాయా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా విక్రమ్ కథల ఎంపిక, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే తీరు, కొత్త కాన్సెప్ట్స్‌ ను ఇంట్రెస్టింగ్ గా చెప్పగల స్టామినాపై నమ్మకం కనిపిస్తోంది. కేవలం పాన్ ఇండియా హంగుల కోసం కాకుండా.. స్ట్రాంగ్ కంటెంట్‌ తో ముందుకెళ్తే విజయ్‌ కు ఇది మరో కీలకమైన మూవీ కావచ్చని చెప్పాలి. ఏదేమైనా విజయ్-విక్రమ్ కాంబినేషన్‌ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా.. నిజమైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా లైగర్ తర్వాత విజయ్ అడుగులు మరింత జాగ్రత్తగా పడుతున్న నేపథ్యంలో.. ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.