Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న దేవరకొండ.. ఇది నిజమేనా..?

విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కుమార్ తో సినిమా చేస్తున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగాయట.

By:  Ramesh Boddu   |   16 Oct 2025 7:00 PM IST
ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న దేవరకొండ.. ఇది నిజమేనా..?
X

కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రాహుల్ సంకృత్యన్ తో సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని ఊరిస్తుంటే నెక్స్ట్ రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా ఒకటి లైన్ లో పెట్టాడు. రౌడీ జనార్ధన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ రెండు సినిమాలు ఉండగా విజయ్ తన నెక్స్ట్ సినిమా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

విజయ్ తో మరోసారి విక్రం కుమార్..

విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కుమార్ తో సినిమా చేస్తున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగాయట. విక్రం, విజయ్ కాంబో సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేశారు యువి క్రియేషన్స్. ఇప్పుడు విజయ్ తో మరోసారి విక్రం కుమార్ సినిమా చేస్తారని తెలుస్తుంది.

విక్రం అసలేమాత్రం ఫాం లో లేడు. మరి ఈ కాంబినేషన్ అసలు ఎలా పాజిబుల్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. విక్రం కుమార్ అసలైతే నెక్స్ట్ నితిన్ తో సినిమా చేయాలని డిస్కషన్స్ లో వచ్చింది. కానీ సడెన్ గా విజయ్ దేవరకొండ తో మూవీ లాక్ చేసుకున్నాడు. యువి బ్యానర్ లో ప్రెస్టీజియస్ సినిమాగా ఇది వస్తుంది. మరి విజయ్ తో విక్రం కాంబో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కెరీర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు..

విజయ్ దేవరకొండ మాత్రం సినిమాల లైనప్ ని క్రేజీగా ప్లాన్ చేస్తున్నాడు. రాహుల్, రవికిరణ్ సినిమాలకు డిఫరెంట్ గా విక్రం సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఐతే ఫ్లాపుల్లో ఉన్నాడు కదా అని విక్రం ని తీసేయ్యడానికి లేదు. ఎందుకంటే మనం లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన అతను 24 లాంటి ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేశాడు. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి టైం లో విక్రం తో రిస్క్ చేయడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిస్తున్నా సరే విక్రం సినిమా మంచి కంటెంట్ తో డిఫరెంట్ అటెంప్ట్ అని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ రాబోతున్న 3 సినిమాలతోనే తన మార్క్ సినిమాలతో అదరగొట్టబోతున్నాడు. మరి విజయ్, విక్రం ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ తో ఆడియన్స్ కి షాక్ ఇవ్వబోతున్నారని టాక్. మరి ఈ సినిమా రేంజ్ ఏంటి దీనికి సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తుంది. రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా విజయ్ దేవరకొండ కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కింగ్ డమ్ టార్గెట్ మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కి రాబోతున్న సినిమాలతో సూపర్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ మూవీస్ నిజంగానే విజయ్ రేంజ్ ని గుర్తు చేస్తాయా లేదా అన్నది చూడాలి.