Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో దేవరకొండ క్రేజీ కాంబినేషన్.. వర్కౌట్ అవుతుందా?

తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్ బయట కనిపించడం చర్చనీయాంశమైంది.

By:  M Prashanth   |   29 May 2026 6:21 PM IST
బాలీవుడ్ లో దేవరకొండ క్రేజీ కాంబినేషన్.. వర్కౌట్ అవుతుందా?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రణబాలి, మరోవైపు రౌడీ జనార్ధన్ సినిమాల షూటింగ్స్‌ లో పాల్గొంటూనే, దర్శకుడు శౌర్యువ్‌ తో మరో కొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఆ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్ బయట కనిపించడం చర్చనీయాంశమైంది. అయితే ఆ మీటింగ్ లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ ఒక్కడే కాకుండా దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా ఆయనతో పాటు కనిపించడం. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌ లో కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మనం, 24, గ్యాంగ్ లీడర్, హలో వంటి విభిన్న కథా చిత్రాలతో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ ఇప్పటికే విజయ్‌ కు ఓ కథ వినిపించారట. ఆ స్టోరీ రౌడీ స్టార్‌ కు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఆ ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరిగినా, కొన్ని కారణాలతో ఆ బ్యానర్ తప్పుకున్నట్లు సమాచారం.

అదే సమయంలో విజయ్, విక్రమ్ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్ లా కనిపించడంతో ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్టును బాలీవుడ్ సంస్థే నిర్మించబోతోందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సక్సెస్ ఫుల్ బ్యానర్స్ లో ఒకటిగా దూసుకుపోతోంది. స్త్రీ, ఛావా వంటి హారర్ కామెడీ, పాన్ ఇండియా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు అలాంటి బ్యానర్‌ తో విజయ్ దేవరకొండ వర్క్ చేసే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా విజయ్ గతంలో బాలీవుడ్ మార్కెట్‌ లో లైగర్ తో అడుగుపెట్టినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఈసారి స్ట్రాంగ్ స్టోరీ, కొత్త తరహా స్క్రీన్ ప్లేతో పాటు భారీ నిర్మాణ సంస్థ మద్దతుతో హిందీ మార్కెట్‌ ను మరోసారి టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు విక్రమ్ కె కుమార్ స్టైల్‌ కు విజయ్ దేవరకొండ ఎనర్జీ కలిస్తే తెరపై పూర్తిగా కొత్త తరహా సినిమా చూడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైంటిఫిక్ థ్రిల్లర్, టైమ్ ట్రావెల్ లేదా మైండ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌ లో కథ ఉండే అవకాశముందని కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే సినిమా జానర్, నటీనటులు, అధికారిక నిర్మాణ సంస్థపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం విజయ్ చేతిలో ఇప్పటికే భారీ సినిమాలు ఉండటంతో ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది? మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ నిజంగానే నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుందా? లేక ఇది కేవలం చర్చల దశలోనే ఉందా? అన్న విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ విజయ్ దేవరకొండ– విక్రమ్ కె కుమార్– మ్యాడ్ డాక్ కాంబినేషన్ మాత్రం ఇప్పటినుంచే హాట్ టాపిక్‌ గా మారిపోయిందని చెప్పాలి. మరి ఆ కాంబో వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.