రౌడీ హీరో సైలెంట్ గా మొదలెట్టేశాడుగా!
సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్, ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Sept 2025 12:37 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్, ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్, ఆ తర్వాత కూడా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే గత కొన్ని సినిమాలుగా విజయ్ కెరీర్ అనుకున్నంత ఫామ్ లో లేదు.
విజయ్‌ను నిరాశ పరిచిన కింగ్‌డమ్
ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ ఇలా దేనికదే భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకోలేకపోయాయి. కింగ్‌డమ్ సినిమా విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనుకుంటే ఆ సినిమా కూడా విజయ్ కు నిరాశనే మిగిల్చింది. అయితే కింగ్‌డమ్ రిజల్ట్ ను మనసులో పెట్టుకుని బాధ పడుతూ కూర్చోకుండా విజయ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు.
క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన రౌడీ హీరో
విజయ్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా మరియు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండింటిలో రాహుల్ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుని పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి అందరికీ తెలుసు.
వీడీ14 షూటింగ్ మొదలు
విజయ్ కెరీర్లో 14వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది. వీడీ14కు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్ లో అఫీషియల్ గా మొదలైందని, మొదటి షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ లోనే జరుగుతుందని, తర్వాత షూటింగ్ కోసం చిత్ర యూనిట్ రాయలసీమ ప్రాంతానికి వెళ్లనున్నట్టు సమాచారం.
గతంలో ఇదే కాంబోలో ట్యాక్సీవాలా
ఆల్రెడీ రాహుల్ తో విజయ్ దేవరకొండ గతంలో ట్యాక్సీవాలా సినిమా చేయగా ఆ సినిమా విజయ్ కు మంచి సక్సెస్ ను అందించింది. ట్యాక్సీవాలా తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది లేటవుతూ ఇప్పటికి కుదిరింది. ట్యాక్సీవాలా తర్వాత రాహుల్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటూ ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండటంతో వీడీ14పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
