Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ఆకలి తీరేలా VD 14.. ఇది మామూలు హామీ కాదుగా!

అయితే ఇటీవలి సినిమాల ఫలితాలతో తాను స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ల ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పాడు.

By:  M Prashanth   |   22 Jan 2026 10:32 PM IST
ఫ్యాన్స్ ఆకలి తీరేలా VD 14.. ఇది మామూలు హామీ కాదుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తనకు టాక్సీవాలా మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తో వర్క్ చేస్తున్నారు. వారి కాంబోలో రూపొందుతున్న VD 14 ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో మూవీ కోసం ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని రాసిన భావోద్వేగ లేఖ ఇప్పుడు వైరల్‌ గా మారింది. యశ్వంత్ అనే అభిమాని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కు తాజాగా హార్ట్ టచింగ్ లేఖ రాశాడు. ఆ లేఖలో విజయ్ దేవరకొండపై తన అభిమానాన్ని, గత కొన్ని ఏళ్లుగా ఎదురైన నిరాశను వివరించాడు. 2018 నుంచి విజయ్ సినిమాల్ని ప్రాణంగా భావిస్తున్నానని, డియర్ కామ్రేడ్ సినిమా తన జీవితాన్ని మార్చిందని యశ్వంత్ పేర్కొన్నాడు.

అయితే ఇటీవలి సినిమాల ఫలితాలతో తాను స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ల ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పాడు. తమ హీరోకు ఒక్క సాలిడ్ హిట్ కావాలని, మళ్లీ గర్వంగా తలెత్తుకుని ఇది తమ హీరో సినిమా అని చెప్పుకునే రోజు రావాలంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఈసారి సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని రాహుల్‌ కు విజ్ఞప్తి చేశాడు.

స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్ వరకూ దర్శకుడు, హీరో ఇద్దరూ దగ్గరుండి చూసుకోవాలని కోరాడు. ప్రమోషన్స్, పాటల విడుదల, టెక్నికల్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాడు. ఇది కేవలం సినిమా కాదు, విజయ్ అభిమానుల గౌరవానికి రీ ఎంట్రీ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. దీంతో ఆ లెటర్ కు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ స్పందించారు. అభిమానులందరి ఆకలిని తీర్చేలా వీడీ 14 ఉంటుందంటూ హామీ ఇచ్చారు.

రాహుల్ ఇచ్చిన ఆ రిప్లై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. అయితే వీడీ 14 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్‌ లో యాక్షన్ డ్రామాగా రూపొందిస్తోంది. కథలో స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో ఉత్కంఠభరితమైన అంశాలు Alhamdulillah సమాచారం. సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న నటిస్తోంది!

విజయ్– రష్మిక జంట మళ్లీ కలిసి నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టాక్సీవాలా తర్వాత రాహుల్ – విజయ్ కాంబో నుంచి మరో బ్లాక్‌బస్టర్ రావాలని అభిమానులు అంతా ఆశిస్తున్నారు. ఇటీవల కొన్ని పరాజయాలతో నిరాశ పరిచిన విజయ్ కు ఈ సినిమా కమ్‌ బ్యాక్‌ గా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. దర్శకుడు ఇచ్చిన హామీ నిజమైతే, వీడీ 14 ఫ్యాన్స్‌ కు ఒక పండగలా మారడం ఖాయం.