విజయ్ దేవరకొండ.. రెండు ఎపిక్ క్యారెక్టర్స్
తాజాగా ఆ గ్లింప్సెస్ ను మిక్స్ చేస్తూ.. రాహుల్ సాంకృత్యాన్ షేర్ చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 30 Jan 2026 11:56 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధనతోపాటు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో రణబాలి చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఆడియన్స్ లో సూపర్ బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి.
అయితే తాజాగా రౌడీ జనార్ధన, రణబాలి డైరెక్టర్స్ రవి కిరణ్, రాహుల్ పోస్ట్ చేసిన స్పెషల్ గ్లింప్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో ఆకట్టుకుని అందరినీ మెప్పిస్తోంది. నిజానికి ఆ రెండు చిత్రాలు వేర్వేరు జోనర్స్ లో రూపొందుతుండగా.. వాటి నుంచి ఇటీవల గ్లింప్సెస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అవి సినీ ప్రియులను విపరీతంగా ఆకర్షించాయి.
తాజాగా ఆ గ్లింప్సెస్ ను మిక్స్ చేస్తూ.. రాహుల్ సాంకృత్యాన్ షేర్ చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. అందులో రాహుల్.. తాను పీరియాడికల్ రూరల్ డ్రామా మూవీ చేస్తున్నానని తెలిపారు. గొప్ప చిత్రం రూపొందుతోందని, ఇది తన ప్రామిస్ అంటూ రాసుకొచ్చారు. రవి కిరణ్ కోలాను ట్యాగ్ చేశారు. అయితే రెండు సినిమాల గ్లింప్సెస్ లోని విజువల్స్ ను అదిరిపోయే రీతిలో ఒకే చోట చూపించారు.
వీడియో చివర్లో.. 2026 సెప్టెంబర్, డిసెంబర్ అని ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. తద్వారా రౌడీ జనార్థన, రణబాలి సినిమాలు.. ఆ నెలల్లో రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే వీడియోను షేర్ చేసిన డైరెక్టర్ రవికిరణ్ కోలా.. ఒకే లక్ష్యమంటూ సింపుల్ గా రాసుకొచ్చారు. తద్వారా ఇద్దరూ కలిసి.. విజయ్ దేవరకొండకు బిగ్గెస్ట్ హిట్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు క్లియర్ గా తెలుస్తోంది.
అయితే ఇప్పుడు స్పెషల్ వీడియో చూసిన నెటిజన్లు.. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ రేంజ్ లో ఉందని కొనియాడుతున్నారు. ఒకే హీరో.. రెండు అద్భుతమైన పాత్రలు... సిల్వర్ స్క్రీన్ కోసం రెండు అద్భుతమైన కథలు అంటూ చెబుతున్నారు. కచ్చితంగా విజయ్ దేవరకొండకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాయమని అంచనా వేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రౌడీ జనార్ధన సినిమా విషయానికొస్తే.. 80స్ కాలంలో తూర్పుగోదావరి నేపథ్యంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రణబాలి మూవీ రూపొందుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరి రౌడీ జనార్ధన, రణబాలి ఎలాంటి హిట్స్ అవుతాయో వేచి చూడాలి.
