విజయ్ సరైన బిజినెస్ మాగ్నెట్ లా ఉన్నాడే..
ఇప్పుడు మరో కొత్త సెక్టార్ ను టార్గెట్ చేశారు. అదే స్కిన్ కేర్. అన్ హైప్ పేరుతో సొంత బ్రాండ్ ప్రారంభించారు. అయితే ఇది కూడా కేవలం తన పేరును ఉపయోగించి తీసుకొచ్చిన బ్రాండ్ కాదు.
By: M Prashanth | 11 Sept 2026 6:11 PM ISTహీరోగా సినిమాలు చేయడం.. హిట్లు కొట్టడం.. ఇదే చాలామంది స్టార్ల కెరీర్. కానీ విజయ్ దేవరకొండ రూటే వేరు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. మరోవైపు తనకంటూ ఓ బిజినెస్ వరల్డ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఫ్యాషన్ నుంచి థియేటర్స్ వరకు వెళ్లిన విజయ్.. ఇప్పుడు స్కిన్ కేర్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో అసలు విజయ్ ను హీరో అనాలా? లేక బిజినెస్ మాగ్నెట్ అనాలా? అనేలా పరిస్థితి మారుతోంది!
విజయ్ దేవరకొండ ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో ఫ్యాషన్ బిజినెస్ లో తన మార్క్ చూపించారు. డ్రెస్సింగ్ బ్రాండ్ తో యూత్ కు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు.. సినిమాలతో పాటు థియేటర్ బిజినెస్ లోనూ అడుగు పెట్టారు. ఏషియన్ సంస్థతో కలిసి ఏవీడీ మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్నారు. అంటే ఒక సినిమా విడుదలైతే అందులో కనిపించడమే కాదు.. ఆ సినిమాను ప్రేక్షకులు చూసే థియేటర్ బిజినెస్ లోనూ విజయ్ పార్టనర్ గా ఉన్నారు.
ఇప్పుడు మరో కొత్త సెక్టార్ ను టార్గెట్ చేశారు. అదే స్కిన్ కేర్. అన్ హైప్ పేరుతో సొంత బ్రాండ్ ప్రారంభించారు. అయితే ఇది కూడా కేవలం తన పేరును ఉపయోగించి తీసుకొచ్చిన బ్రాండ్ కాదు. విజయ్ కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్ట్స్ మేకింగ్ లో కూడా ఆయన భాగమయ్యారు. దాదాపు 9నెలల పాటు ప్రొడక్ట్స్ ను టెస్ట్ చేసి, ఫార్ములేషన్స్ పై పనిచేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు బ్రాండ్ చెబుతోంది.
ఇక్కడ విజయ్ ఆలోచన కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కిన్ కేర్ అంటే పెద్ద పెద్ద మాటలు, అనవసరమైన హడావుడి కాకుండా.. అవసరమైన ప్రొడక్ట్స్ ను సింపుల్ గా అందించాలన్నది అన్ హైప్ టార్గెట్. యూత్ ను దృష్టిలో పెట్టుకుని మొటిమలు, జిడ్డు చర్మం, సన్ టాన్ వంటి సమస్యలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ తో బ్రాండ్ మొదలుపెట్టారు. ఇలా చూస్తే విజయ్ బిజినెస్ జర్నీ ఒక్క సెక్టార్ కే పరిమితం కావడం లేదు.
సినిమా... థియేటర్స్.. ఫ్యాషన్.. ఇప్పుడు స్కిన్ కేర్. తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ను ఒక్కో డిపార్మెంట్ లో సొంత బ్రాండ్ గా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ లో ఉన్న తన క్రేజ్ ను బిజినెస్ లో కూడా యూజ్ చేసుకుంటున్నారు. మరోవైపు సినిమాల పరంగా కూడా విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. రణబాలితో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇటీవల పలు సినిమాలతో నిరాశపరిచిన విజయ్ ఒకవైపు హీరోగా కమ్ బ్యాక్ కోసం సిద్ధమవుతూనే.. మరోవైపు బిజినెస్‌లో కొత్త కొత్త స్టెప్స్ వేస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ కెరీర్ ను ఇప్పుడు కేవలం హీరోగా చూడటం కష్టమే. స్క్రీన్ పై స్టార్ గా.. స్క్రీన్ వెనుక బిజినెస్ మ్యాన్ గా.. తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న తీరు చూస్తే.. విజయ్ నిజంగానే సరైన బిజినెస్ మాగ్నెట్ లా ఉన్నాడని అనేక మంది నెటిజన్లు అంటున్నారు.
