ప్లాప్ ల్లో ఉన్నా అదే క్రేజ్ తో నయా స్టార్!
అయినా వైఫల్యాలేవి విజయ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేదు. దర్శక, నిర్మాతలంతా విజయ్ తో సినిమాలు చేయడా నికే ఆసక్తి చూపిస్తున్నారు.
By: Srikanth Kontham | 20 Sept 2025 10:00 PM ISTవిజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా కనిస్తున్నాడు గానీ? సక్సెస్ ల సంగతేంటని చరిత్రలోకి వెళ్తే? 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం', 'టాక్సీవాలా' తప్పమరే చిత్రం హిట్ రేసులో లేదు. `టాక్సీవాలా` తర్వాత 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' ,'ఖుషీ', 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రాలు చేసాడు. వీటిలో విజయాలెన్ని అంటే? గట్టిగా ఒకటి కూడా కనిపించదు. వీటీలో కాస్త మెరుగైన ఫలితాలంటే? ఖుషీ, ఫ్యామిలీ స్టార్ మాత్రమే కనిపిస్తాయి. కానీ విజయ్ ఇమేజ్ ముందు అవేవి సక్సెస్ లు కాదు. బిలో యావరేజ్ గా ఆడిన చిత్రాలే.
దేవరకొండ లక్కీ గయ్:
అయినా వైఫల్యాలేవి విజయ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేదు. దర్శక, నిర్మాతలంతా విజయ్ తో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఇంపాక్ట్ మార్కెట్ లో ఏ స్థాయిలో ఉందంటే? విజయ్ ని బలవంతంగా కమిట్ చేయిస్తున్నట్లే కొందరి నిర్మాతల తీరులో కనిపిస్తోంది. విజయ్ తన బిజీ షెడ్యూల్ చెబుతున్నా? అడ్వాన్సులు వద్దు అని చెబుతున్నా? వినకుండానే చాలా మంది నిర్మాతలు సూట్ కేసులు చేతిలో పెట్టి వస్తున్నారుట. దర్శకులు సైతం అదే స్థాయిలోలో అతడి కోసం క్యూలో ఉంటున్నారుట.
వెంట పడి మరీ అవకాశాలు:
విజయ్ ని ఎలాగైనా పట్టుకుని కథ చెప్పాలన్నా ఆసక్తితో అతడి చుట్టూనే తిరుగుతోన్న వారి సంఖ్య అంతంకంతకు పెరుగుతుందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. సాధారణంగా హీరో ప్లాప్ ల్లో ఉంటే నిర్మాతలు అతడి దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్లరు. పొరపాటున కనిపిస్తే ముఖం చాటేసుకుని వెళ్లిపోతారు. కనబడితే ఎక్కడ తన తో సినిమా తీయమంటాడో? అని! కానీ విజయ్ విషయంలో అదెక్కడా కనిపించలేదు. నిర్మాతలు అతడి కళ్ల ముందే తిరుగు తున్నారు.
రెండు విజయాలతో బౌన్స్ బ్యాక్:
నాకు ఓ ఛాన్స్ ఇస్తాడా? అంటూ! దర్శకులు లెక్క అలాగే ఉంది. ఈ రెండు సన్నివేశాలే చెబుతున్నాయి ఇండ స్ట్రీలో విజయ్ స్థానం ఏంటి? అన్నది. నటుడిగా అతడికి ఉన్న ఇమేజ్ ముందు ప్లాప్ లు ఎక్కడా హైలైట్ కాలేదు. వరుసగా ప్లాప్ లు ఎదురైతే స్టార్ హీరో మార్కెట్ సైతం డౌన్ అవుతుంది. కానీ విజయ్ మార్కెట్ ఎక్కడా డౌన్ అవ్వలేదని తాజా సన్నివేశంతో మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం విజయ్ `రౌడీ జనార్దన్` సహా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదొక పిరియాడిక్ చిత్రం. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల విజయంలో బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశీస్తున్నారు.
