క్లాసిక్ దర్శకుడితో దేవరకొండ కొత్త ప్రయాణం!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
By: Srikanth Kontham | 15 March 2026 12:32 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన లైనప్‌లోకి మరో ఆసక్తికరమైన పేరు వచ్చి చేరింది. తొలి చిత్రం `హాయ్ నాన్న`తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌ను నమోదు చేసిన యువ దర్శకుడు శౌర్యువ్. తాజాగా ఇప్పుడాయన విజయ్ దేవరకొండకు ఓ అద్భుతమైన కథను వినిపించినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయిందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
శౌర్యువ్ మొదటి సినిమా `హాయ్ నాన్న`లో చూపించిన ఎమోషనల్ డెప్త్ , టేకింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించి తానో క్లాసిక్ డైరెక్టర్ అని నిరూపిం చుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ వంటి మాస్ - యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోని ఆయన ఏ విధంగా చూపిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే శౌర్యువ్ మార్క్ సున్నితమైన భావోద్వేగాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని విజయ్ ఈ స్క్రిప్ట్ పట్ల చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయ్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోవడం ఖాయం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్, రవి కిరణ్ కోలా వంటి టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. వాటి తర్వాత శౌర్యువ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవైపు మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు శౌర్యువ్ లాంటి దర్శకులతో క్లాసిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం విజయ్ మారుతున్న ఆలోచనా విధానానికి నిదర్శనం. ఈ చిత్రం ద్వారా విజయ్ మళ్ళీ తనలోని ఎమోషనల్ యాక్టర్‌ను వెలికితీసే ఛాన్స్ ఉంది.
ఈ ప్రాజెక్టును ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉందిట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. `హాయ్ నాన్న` తర్వాత శౌర్యువ్ చేస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా తమ హీరో నుండి ఒక హార్ట్ టచింగ్ మూవీ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ కోసం సోషల్ మీడియాలో రౌడీ ఫ్యాన్స్ అప్పుడే సందడి మొదలుపెట్టారు.
