దేవరకొండ మళ్లీ ఛాన్స్ అడిగాడా?
'టాక్సీవాలా' తర్వాత విజయ్ దేవరకొండకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' ,' 'కింగ్ డమ్' లాంటి చిత్రాలు పరాజయం కోటాలోనే పడ్డాయి.
By: Srikanth Kontham | 29 Nov 2025 10:15 PM IST'టాక్సీవాలా' తర్వాత విజయ్ దేవరకొండకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' ,' 'కింగ్ డమ్' లాంటి చిత్రాలు పరాజయం కోటాలోనే పడ్డాయి. 'ఖుషీ', 'ది ఫ్యామిలీ స్టార్' లాంటి చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. అయినా పరాజయాలు... యావరేజ్ చిత్రాలు విజయ్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. స్టార్ అనే ఇమేజ్ అతడికి వరుస అవకాశాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికీ అదే ఇమేజ్ తో ఛాన్సులందుకుంటున్నాడు. ఇలా ఎంత కాలం అంటే? మార్కెట్ పై ప్రభావాన్ని చూపించనంత కాలం చెల్లుతుంది.
ఆ సినిమా తర్వాత మరో ఛాన్స్ కోసం:
ఈ నేపథ్యంలో విజయ్ అలెర్ట్ అవుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా విజయ్, సందీప్ రెడ్డి వంగాను మీట్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో చర్చకొచ్చింది. తనతో మరో సినిమా తీయమని అడిగాడట. అందుకు సందీప్ ఎలాంటి సమాధానం ఇచ్చాడు? అన్నది బయటకు రాలేదు గానీ సమావేశం వెనుక సారాంశం అదేనని సన్నిహితుల నుంచి తెలిసింది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో 'అర్జున్ రెడ్డి' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. హీరోగా విజయ్ కి..డైరెక్టర్ గా సందీప్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రమిది. కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో అర్జున్ రెడ్డి ఒకటిగా నిలిచింది.
అతడి కోసం అగ్ర తారలే క్యూలో:
అప్పటికే 'పెళ్లి చూపులు' అనే సక్సెస్ దేవరకొండకు బ్యాకప్ గా ఉంది. నటుడిగా అవకాశాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో సందీప్ 'అర్జున్ రెడ్డి' కథతో అప్రోచ్ అవ్వడం విజయ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సందీప్ కి అదే డెబ్యూ మూవీ. కానీ విజయ్ సందీప్ ని నమ్మి ఇచ్చిన అవకాశం. ఆ తర్వాత సందీప్ 'యానిమల్' సక్సెస్ తో అతడి రేంజే మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' తీస్తున్నాడు. అటుపై 'యానిమల్ పార్క్' తీస్తాడు. సందీప్ కోసం మహేష్, బన్నీ, రామ్ చరణ్ సహా ఎంతో మంది బాలీవుడ్ హీరోలు కూడా క్యూలో ఉన్నారు.
సందీప్ ఏమంటాడో?
ఇలాంటి సమయంలో దేవరకొండ రిక్వెస్ట్ ను సందీప్ కన్సిడర్ చేస్తాడా? దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన విజయ్ కు మరో ఛాన్స్ సందీప్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. విజయ్ దేవరకొండతో పని చేయాలని చాలా మంది స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. పరశురాం, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు విజయ్ కోసం కథలు రాసి రెడీగా ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. సందీప్ తోనే ఉన్నపళంగా మరో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడు.
