Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ ఆ ఇద్ద‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడా?

టాలీవుడ్ స్టార్ హీరోలు కొంత మంది ఒక్కో పాన్ ఇండియా మూవీతో బిజీ బిజీగా గ‌డిపేస్తుంటే టైర్ 2 హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తూ క్రేజీ లైన‌ప్‌ని రెడీ చేసుకుంటున్నారు.

By:  Ravindar Gorantla   |   6 March 2026 12:24 PM IST
రౌడీ స్టార్ ఆ ఇద్ద‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడా?
X

టాలీవుడ్ స్టార్ హీరోలు కొంత మంది ఒక్కో పాన్ ఇండియా మూవీతో బిజీ బిజీగా గ‌డిపేస్తుంటే టైర్ 2 హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తూ క్రేజీ లైన‌ప్‌ని రెడీ చేసుకుంటున్నారు. ఒక్కో హీరో మూడు నుంచి నాలుగు సినిమాల‌ని లైన్‌లో పెట్టేసుకుంటున్నాడు. ఈ జాబితాలో నిలుస్తున్న స్టార్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మునుపెన్న‌డూ లేనంత‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ల విష‌యంలో స్పీడు పెంచేశాడు. బ్యాక్ టు బ్యాక్ భారీ క్రేజీ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం విజ‌య్ తేర‌వ‌కొండ రెండు భారీ సినిమాల్లో న‌టిస్తున్నాడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న `రౌడీ జ‌నార్థ‌న‌` ఒక‌టి కాగా రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `ర‌ణ‌బాలి`. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగు పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ర‌వికిర‌ణ్ కోల `రౌడీ జ‌నార్థ‌న‌`ని రూపొందిస్తున్నాడు. క‌రుగుగ‌ట్టిన రౌడీగా ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న సినిమా ఇది. మేకోవ‌ర్‌, క్యారెక్ట‌ర్ డిజైన్‌, డైలాగ్ డిక్ష‌న్ సరికొత్త‌గా ఉండే సినిమా ఇది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీతో పాటు భారీ పాన్ ఇండియా మూవీగా `ర‌ణ‌బాలి` రూపొందుతోంది. ప్రీ ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా ఇది. స్వాత్ంత్రానికి పూర్వం ఓ యువ‌కుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో దీన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 11న ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల‌పై దృష్టి పెట్టాడు.

ఈ రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ త‌రువాత మ‌రో రెండు భారీ ప్రాజెక్ట్‌ల‌కు విజ‌య్ దేర‌వ‌కొండ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతున్న‌ట్టుగా తెలిసింది. ఇందులో ఒక‌టి విక్ర‌మ్ కె కుమార్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంది. దీనితో పాటు తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు రౌడీ హీరో గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడ‌ని తెలిసింది.

నేచుర‌ల్ స్టార్ నానితో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా `హ‌య్ నాన్న‌`ని రూపొందించి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న శౌర్య‌వ్ ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండకు స్క్రిప్ట్ వినిపించాడ‌ట‌. స్టోరీ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. అన్ని క‌రెక్ట్‌గా కుదిరితే ఈ మూవీని వైరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.