Begin typing your search above and press return to search.

రౌడీ నుంచి ఇది క‌దా కావాల్సింది!

రా అండ్ రూత్‌లెస్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ క‌నిపించిన తీరు, త‌న మేకోవ‌ర్ టెర్రిఫిక్‌గా ఉంద‌ని ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ అంటున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   23 Dec 2025 11:12 AM IST
రౌడీ నుంచి ఇది క‌దా కావాల్సింది!
X

`క‌ళింగ ప‌ట్నంలో ఇంటికొక‌డు నేను రౌడీని అని చెప్పుకుని తిరుగుతాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్పుకున్నోడు ఒక్క‌డే ఉన్నాడు. జ‌నార్ధ‌న...రౌడీ జ‌నార్ధ‌న‌`... రౌడీ హారో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `రౌడీ జ‌నార్ధ‌న‌`లోనిది ఈ డైలాగ్‌. రీసెంట్‌గా విడుద‌ల చేసిన గ్లింప్స్‌లో రైడీ గెట‌ప్‌, గోదావరి యాస‌లో త‌ను చెప్పిన మాస్ డైలాగ్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. రా అండ్ రూత్‌లెస్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ క‌నిపించిన తీరు, త‌న మేకోవ‌ర్ టెర్రిఫిక్‌గా ఉంద‌ని ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ అంటున్నారు.

రాజుని సింహాస‌నంపైనే కూర్చోబెట్టాలి. బంటుని కాప‌లాగే ఉంచాలి. అలా కాకుండా రాజుని కాప‌లాకు పెట్టి బంటుని సింహాసంపైన కూర్చోబెడితే అది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలోనూ `అర్జున్‌రెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఇదే జ‌రుగుతూ వ‌చ్చింది. ఈ సినిమాలో విజ‌య్ జీవిత కాలంలో ఏ ఆర్టిస్ట్‌కు ల‌భించ‌ని క్యారెక్ట‌ర్లో క‌నిపించాడు. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేష‌న్స్ ఉన్న క్యారెక్ట‌ర్ ల‌భించ‌డం చాలా చాలా అరుదు. అలాంటి క్యారెక్ట‌ర్‌ని టేకింగ్ గ్రాంటెడ్ అనే స్థాయిలో పోషించి ఔరా అనిపించాడు.. పాథ్‌బ్రేకింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందుకున్నాడు.

అయితే ఆ త‌రువాత విజ‌య్ క్రేజ్‌కు త‌గ్గ స్టోరీస్‌ని, క్యారెక్ట‌ర్స్‌ని ఎంచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. న‌టుడిగా త‌న‌కున్న క్యాలిబ‌ర్‌ని గుర్తించ‌కుండా త‌ను న‌చ్చిన‌, త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ త‌న క్రేజ్‌ని తానే త‌గ్గించుకుంటూ పోయాడు. వ‌రుస‌గా త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ వ‌చ్చాడు. ఇదే స‌మ‌యంలో `లైగ‌ర్‌`తో బ్లండ‌ర్ మిస్టేక్ చేసి మ‌రింత కూరుకుపోయాడు. `అర్జున్‌రెడ్డి` టైమ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూసి కేరింత‌లు కొట్టిన రౌడీ ఫ్యాన్స్ `లైగ‌ర్‌` త‌రువాత నుంచి నీర‌సించిపోయారు.

మ‌ళ్లీ రౌడీకి త‌గ్గ సినిమా ఎప్పుడు? అని ఆశ‌గా ఎదురు చూడ‌టం మొద‌లు పెట్టారు. ఇన్నాళ్ల‌కు `రౌడీ జ‌నార్ధ‌న‌`తో ఆ క‌ల నెర‌వేరేలా క‌నిపిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్‌, అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ మేకోవ‌ర్‌, గోదావ‌రి యాస‌లో త‌ను ప‌లికిన డైలాగ్స్ చూసిన ఫ్యాన్స్ ఇది క‌దా రౌడీ నుంచి కావాల్సింది అని కామెంట్‌లు చేస్తున్నారు. `రౌడీ జ‌నార్ధ‌న‌`ని 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ఒక రౌడీ ప్ర‌స్థానం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నాడుగా తెలుస్తోంది.

ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ, క్యారెక్ట‌ర్ కూడా అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌టం, బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్టు కోసం విజ‌య్ ఎదురు చూస్తుండ‌టంతో ఈ సినిమాకు సంబంధించి భాష‌, యాస‌, క్యారెక్ట‌ర్ మేకోవ‌ర్ విష‌యాల‌లో డైరెక్ట‌ర్‌కు మించి కేర్ తీసుకున్నాడ‌ట‌. ఇందులో విజ‌య్ గోదావ‌రి యాస‌లో సాగే క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ఇందు కోసం గోదావ‌రి యాస‌పై ప‌ట్టు సాధించి మ‌రీ డైలాగ్‌లు చెప్పాడ‌ని, ఆయ‌న మాట్లాడుతుంటే చాలా బాగుంద‌ని డైరెక్ట‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే ఇక్క‌డో విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెచెప్పుకోవాలి.. విజ‌య్ దేవ‌ర‌కొండ బేసిక్‌గా తెలంగాణ వాసి. ఇందులో గోదావ‌రి యాస‌లో సాగే పాత్ర‌లో న‌టిస్తుండ‌గా `ది ప్యార‌డైజ్‌` మూవీలో గోదావ‌రి జిల్లాకు చెందిన నాని తెలంగాణ యాస‌లో సాగే పాత్ర‌లో న‌టిస్తుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారాయి. `రౌడీ జ‌నార్ధ‌న‌` 2026 డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతుంటే నాని `ది ప్యార‌డైజ్‌` మార్చి 26న పాన్ ఇండియా మూవీగా రాబోతోంది.