పేట రౌడీగా ఆ స్టార్ హీరో!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్దన్` లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 22 Sept 2025 5:00 PM ISTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్దన్` లాక్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సెట్స్ కు వెళ్లడం ఆలస్యమవుతోన్న నేపథ్యంలో రాజుగారు ఇకపై ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదని టీమ్ కి సూచించారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన డేట్ల ప్రకారం ఎక్కడా సమయం వృద్ధా కాకుండా ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాల్సిందేనని ప్రొడక్షన్ టీమ్ అండ్ కోని ఆదేశించారు.
మాస్ పాత్రలో రాజశేఖర్:
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇందులో విలన్ పాత్రకు రాజశేఖర్ ఎంపికైటనట్లు వినిపిస్తోంది. అలాంటి ఇలాంటి విలన్ రోల్ కాదు. ఏకంగా పేట రౌడీ పాత్రలోనే రాజశేఖర్ కనిపించబోతున్నారని తెలిసింది. ఈ పాత్రకు సంబంధించి ప్రత్యేకించి చెన్నై నుంచి మ్యాకప్ ఆర్టిస్టులను...డిజైనర్లను పిలుపిస్తున్నారుట. పక్కా మాస్ కంటెంట్ ఉన్న చిత్రం కావడంతో విలన్ పాత్ర కూడా అంతే మాసివ్ గా కనెక్ట్ చేసే దిశగా రవి కిరణల్ అడుగులు వేస్తున్నాడు. రాజశేఖర్ ఈ పాత్ర అంగీకరించడానికి కారణం కూడా పాత్రలో ఘాడతేనని తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించి రాజశేఖర్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారుట.
ఆస్టార్ హీరోకి సైతం నో చెప్పిన స్టార్:
పాత్రకు పర్పెక్ట్ గా సూటయ్యారని చెబుతున్నారు. విలన్ గా చాలా మంది స్టార్ హీరోలు ఆఫర్ చేసారు. కానీ రాజశేఖర్ మాత్రం ఆఛాన్స్ తీసుకోలేదు. పాత్ర సహా సినిమాలో హీరోతో ఉన్న ర్యాపో కారణంగా ముందుకెళ్తున్నారు. గతంలో చిరంజీవి సినిమాలో కూడా విలన్ పాత్ర ఆఫర్ చేసారు. కానీ ఆయన నో చెప్పారు.` రౌడీ జనార్దన్` పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ స్టోరీ. కథలో రాజకీయాలు కూడా బలంగానే ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఈనేపథ్యంలో కథకు తగ్గట్టే పాత్రలను ఎంపిక చేసారు. అలా సినిమా లోకి పేట రౌడీ పాత్రలో రాజశేఖర్ చేరుతున్నారు.
ఆ సినిమాతో పాటు సెట్స్ కు:
ఇక హీరో పేరు ముందే రౌడీ ఉంది కాబట్టి ఆ పాత్ర ఎలా ఉంటుందన్నది ఊహకే అందదు. ప్రస్తుతం విజయ్ దేవర కొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో రౌడీ జనార్దన్ కూడా పట్టాలెక్కిస్తున్నారు. ఆ సినిమాతో పాటు, ఏక కాలంలో రౌడీ జనార్దన్ కూడా మొదలవుతుంది. ఇంకా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో బయటకు రానున్నాయి.
