'DC' విజయ్ దేవరకొండ చేసి ఉంటే..!
దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ ఇటీవల హీరోగా 'డీసీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 31 Aug 2026 1:46 PM ISTదర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ ఇటీవల హీరోగా 'డీసీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన 'డీసీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటుడిగా మొదటి సినిమాతోనే లోకేష్ కనగరాజ్ ఏకంగా రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఈ సినిమా భారీ విజయం నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో నటించిన లోకేష్ కనగరాజ్, చంద్ర పాత్రలో నటించిన వామికాను తప్ప మరెవ్వరినీ కనీసం ఊహించుకోలేం అంటున్నారు. కానీ మొదటగా ఈ సినిమా కథను మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వద్దకు దర్శకుడు తీసుకు వెళ్లాడట, ఈ విషయాన్ని స్వయంగా విజయ్ చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ హీరోగా 'డీసీ' మూవీ...?
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమా కథను విజయ్ దేవరకొండను ఊహించుకుంటూ రాశాడట. విజయ్ దేవరకొండ ఈ సీన్‌లో అయితే ఇలా ఉంటాడు అనుకుంటూ దర్శకుడు సీన్ టు సీన్ రాసుకున్నాడట. మొత్తం కథ పూర్తి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లడం జరిగిందట. కథ విన్న విజయ్ దేవరకొండ నచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమాను చేయలేను అని చెప్పాడట. అందుకు కారణం విజయ్ అప్పటికే 'కింగ్డమ్' సినిమా చేస్తున్నాడట. ఆ సినిమా తర్వాత చేద్దామని అనుకున్నా కూడా డీసీ సినిమాలోని హీరో పాత్ర, కింగ్డమ్ సినిమాలోని హీరో పాత్రలు ఒకే విధంగా అనిపిస్తున్నాయని, రెండు పాత్రలు ఒకే విధంగా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చేయడం వల్ల ప్రేక్షకులకు బోర్ ఫీల్ కలుగుతుందనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ 'డీసీ' సినిమాను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ నటించిన డీసీ...
అర్జున్ రెడ్డి వంటి విభిన్నమైన పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ కచ్చితంగా 'డీసీ' లోని దేవదాస్ పాత్రను అద్భుతంగా పండించేవాడు. ఆ యాక్షన్ సీన్స్‌తో పాటు, హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ కు విజయ్ దేవరకొండ పూర్తి న్యాయం చేసేవాడు. లోకేష్ కనగరాజ్‌తో పోల్చితే విజయ్ దేవరకొండకు ఈతరహా పాత్రలు బాగా చేస్తాడు అనే ఇమేజ్ ఉంది. కనుక డీసీలో విజయ్ దేవరకొండ హీరో అయ్యి ఉంటే కమర్షియల్‌గా మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఉండేది అనడంలో సందేహం లేదు. కింగ్డమ్ సినిమా కోసం డీసీ సినిమాను వదిలేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశాడో అంటూ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాలోని హీరో పాత్రపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. డీసీలోని హీరో పాత్రతో కింగ్డమ్ హీరో పాత్రను ఎలా పోల్చుకున్నావు భయ్యా అంటూ విజయ్ దేవరకొండను చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
రణబాలి, రౌడీ జనార్థన మూవీస్‌తో..
నటుడిగా ఏమాత్రం అనుభవం లేని లోకేష్ కనగరాజ్ డీసీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, రూ100 కోట్ల క్లబ్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అనడంలో సందేహం లేదు. మరో వైపు కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్‌డం తగ్గిందంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేశారు. మొత్తానికి డీసీని వదులుకోవడం అనేది విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అత్యంత ఖరీదైన తప్పిదంగా చాలా మంది దీన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమాతో పాటు రౌడీ జనార్థన సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. రణబాలి సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుండగా, రౌడీ జనార్థన సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై రౌడీ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేనా అనేది చూడాలి.
