నెగిటివ్ బజ్.. అన్ని గమనిస్తున్న విజయ్
ఒక సినిమా రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ ఎంత ముఖ్యమో.. నెగిటివ్ బజ్ కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది.
By: M Prashanth | 8 Oct 2026 9:43 PM ISTఒక సినిమా రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ ఎంత ముఖ్యమో.. నెగిటివ్ బజ్ కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా జెనరేషన్ లో సినిమా గురించి ఒకే లాంటి పోస్టులు, రీల్స్ పదేపదే కనిపిస్తే.. అవి నిజంగా ఆడియన్స్ అభిప్రాయమా, లేక కావాలనే క్రియేట్ చేస్తున్న బజ్ నా అనే చర్చ మొదలవుతుంది. ఇప్పుడు రణబాలి విషయంలో కూడా అదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తనపై, తన సినిమాలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ పై విజయ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఆయన మాటల్లో కేవలం ఆవేదన కంటే.. సోషల్ మీడియా బజ్ ను తాను ఎలా గమనిస్తున్నాడనే విషయం ఎక్కువగా కనిపించింది.
సాధారణంగా ఒక హీరోపై విమర్శలు వస్తే వాటిని ఫ్యాన్స్ వర్సెస్ యాంటీ ఫ్యాన్స్ గా చూడొచ్చు. కానీ విజయ్ చెప్పిన విషయం అంతకంటే భిన్నంగా ఉంది. ఒకే విధమైన కంటెంట్ చాలా అకౌంట్ల నుంచి ఒకేసారి రావడం, ఒకే రకమైన రీల్స్ షేర్ కావడం వంటి వాటిని ఆయన ప్రస్తావించారు. అంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ట్రెండ్ ను యూజర్స్ అభిప్రాయంగా తీసుకోకూడదన్నది ఆయన చెప్పిన పాయింట్.
నిజానికి సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఒక ఒపినీయన్ ఏర్పడుతుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ తో పాటు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కూడా దానిపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక సినిమాను చూడొద్దని పదేపదే ప్రచారం జరిగితే.. సినిమా గురించి ఇంకా చూడని ఆడియన్స్ లో కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే విజయ్ నెగిటివ్ బజ్ ను గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ఉందని చెప్పడం మాత్రమే సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకురాదు. చివరికి థియేటర్ లో ప్రేక్షకులకు సినిమా నచ్చాలి. స్టోరీ, మేకింగ్, యాక్టింగ్, ఎంటర్టైన్‌మెంట్.. ఇవే మూవీ రిజల్ట్ ను డిసైడ్ చేస్తాయి. అందుకే విజయ్ తనపై వస్తున్న ప్రచారానికి ఎక్కువగా రియాక్ట్ కాకుండా.. సినిమా మీద నమ్మకంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తనపై తనకు ఉన్న నమ్మకాన్ని కొందరు బలుపుగా చూస్తున్నా తాను తగ్గేది లేదని విజయ్ చెప్పడం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
తన జర్నీ, తన హార్డ్ వర్క్ పై నమ్మకంతోనే ముందుకు వెళ్తానని ఆయన క్లారిటీ ఇచ్చినట్లే. అయితే ఇప్పుడు నెగిటివ్ బజ్ ను రణబాలి మూవీ ఎంతవరకు ఎదుర్కొంటుంది, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నదే మెయిన్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు వచ్చినా.. థియేటర్ లో ప్రేక్షకుడు ఇచ్చే జడ్జిమెంటే చివరి రిజల్ట్. మరి రణబాలి విషయంలో ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
