రియాలిటీ నుంచి ఇన్‌స్పైర్ అయిన రౌడీ జనార్థన
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో, ఎవరికి ఎప్పుడు పేరొస్తుందో ఎవరూ చెప్పలేం.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 11:00 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో, ఎవరికి ఎప్పుడు పేరొస్తుందో ఎవరూ చెప్పలేం. కొందరికి మొదటి సినిమాతోనే పేరొస్తే, మరికొందరికి ఎంతో కాలానికి కానీ పేరు రాదు. అయితే డైరెక్టర్ల విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మొదటి సినిమాతోనే మంచి మార్క్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి రెండో సినిమా ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్లీ అవకాశాలు రావు.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు
అలా మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తనకంటూ మంచి పేరును తెచ్చుకున్న డైరెక్టర్ రవికిరణ్ కోలా. రాజావారు రాణి గారు సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రవికిరణ్ ఇప్పటివరకు మరో సినిమాను చేసింది లేదు. ఆ సినిమా వచ్చింది 2019లో. ఆ సినిమా రిలీజై ఇన్నేళ్లవుతున్నా రవికిరణ్ నుంచి ఇంకో సినిమా రాలేదు. కానీ మధ్యలో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాకు రవికిరణ్ కథను అందించి ఆ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.
విజయ్ దేవరకొండతో సినిమా
అయితే రవికిరణ్ కోలా తన తర్వాతి సినిమాను టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేయనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో మూవీ కూడా అనౌన్స్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. తన తాజా సినిమా కింగ్‌డమ్ ఇంటర్వ్యూల్లో విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి మాట్లాడారు.
రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయి..
రవి కిరణ్ ఈ కథను రియాలిటీ నుంచి తీసుకున్నాడని, వాళ్ల నాన్నను చూసి ఇన్‌స్పైర్ అయ్యి, రవికిరణ్ ఈ కథ రాశాడని, అక్కడక్కడా ఫిక్షనల్ గా కూడా ఉంటుందని, సినిమా మొత్తం ఒక చిన్న టౌన్ లో జరుగుతుందని, ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు కాబట్టి ఆ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదని విజయ్ దేవరకొండ తెలిపారు. రవి కిరణ్ ఈ కథను రియాలిటీ నుంచి తీసుకున్నాడని, వాళ్ల నాన్నను చూసి ఇన్‌స్పైర్ అయ్యి, రవికిరణ్ ఈ కథ రాశాడని, అక్కడక్కడా ఫిక్షనల్ గా కూడా ఉంటుందని, సినిమా మొత్తం ఒక చిన్న టౌన్ లో జరుగుతుందని, ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు కాబట్టి ఆ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదని విజయ్ దేవరకొండ తెలిపారు. కాగా విజయ్ తో తాను చేస్తున్న సినిమాకు రౌడీ జనార్ధన అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు ఓ సందర్భంగా దిల్ రాజు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఈ సినిమాతో పాటూ రాహుల్ సాంకృత్య్సన్ తో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాల తర్వాత కింగ్‌డమ్ సీక్వెల్ ఉంటుందని విజయ్ వెల్లడించాడు.
