రష్మిక - విజయ్ పెళ్లి ఫిక్స్.. కన్ఫర్మ్ చేసిన అధ్యక్షుడు!
గత నాలుగు సంవత్సరాలుగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 21 Jan 2026 11:40 AM ISTగత నాలుగు సంవత్సరాలుగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలసి తొలిసారి నటించిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు.ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా ఈ రూమర్స్ మరింత బలంగా వినిపించాయి.
అయితే మీడియా కంట పడకుండా ఈ జంట ఎంత ప్రయత్నం చేసినప్పటికీ.. ఆడియన్స్, నెటిజన్స్ నుండి తప్పించుకోలేకపోయారు. ఇక ఎట్టకేలకు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా వీరు బయట పెట్టలేదు.ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించిన విషయాలను వీరు గోప్యంగా ఉంచడం అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఈ ఏడాది ఉదయపూర్ లో ఫిబ్రవరి 26వ తేదీన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక దీనిపై స్పందిస్తూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అంటూ తనదైన శైలిలో స్పష్టం చేసింది. అయితే రష్మిక, విజయ్ దేవరకొండ తో పెళ్లి పై క్లారిటీ ఇవ్వనుందా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తుందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎదురుచూసిన అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతోంది. అయితే సడన్గా ఒక వ్యక్తి వీరిద్దరి వివాహాన్ని కన్ఫర్మ్ చేస్తూ చేసిన కామెంట్లతో అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తాజాగా విజయ్ - రష్మిక జంటకు విషెస్ చెబుతూ.. వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికైతే ఇంతవరకు రష్మిక - విజయ్ దేవరకొండ నుంచీ తమ పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సడన్గా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన ఈ విషయంపై స్పష్టం చేశారు అంటే కచ్చితంగా వీరి బంధం నిజమే.. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అంటూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆకాంక్షించే అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారడంలో సందేహం లేదు.
