విజయ్ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తారంటే?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మిక , విజయ్ దేవరకొండ కూడా ఒకరు.
By: Madhu Reddy | 13 Nov 2025 10:32 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మిక , విజయ్ దేవరకొండ కూడా ఒకరు. గీతా గోవిందం సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.. మళ్ళీ మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమాలు చూడాలని తెగ ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది.
ఇకపోతే అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఎక్కడ చూసినా ఈ జంట.. జంటగా కనిపించారు. పైగా పలు వెకేషన్ లకు జంటగా కలిసి వెళ్లారు. కానీ ఆ ఫోటోలు బయటకు రాకుండా మేనేజ్ చేశామని అనుకున్నారు. అయితే ఆ లొకేషన్లు మాత్రం వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారని తెలిసేలా చేశాయి. అలా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నిసార్లు వార్తలు వచ్చినా.. ఈ జంట మాత్రం దీనిపై స్పందించలేదు. దీనికి తోడు వీరిద్దరికీ ఇటీవల రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగింది.. కానీ ఈ విషయంపై కూడా స్పందించలేదు. అటు వార్తలు వచ్చినా ఖండించే ప్రయత్నం చేయలేదు.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు రష్మిక తాజాగా నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ వస్తారని.. ఈ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలవల్ల విజయ్ ఈవెంట్ కి రాలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. అందులో భాగంగానే ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
ఇక్కడ పబ్లిక్ గా ఆమె చేతికి ముద్దు పెట్టి స్టేజ్ పైకి వచ్చిన ఈయన.. అనంతరం ఆమెను ముద్దు పేరుతో పిలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఈవెంట్ లో భాగంగా రష్మికను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.." రషీ " అంటూ ఆమెను ముద్దుగా పిలిచారు. ఈ పిలుపు విని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండను "విజ్జు" అని పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలా మొత్తానికైతే ఈ జంట ఒకరికొకరు ముద్దు పేర్లతో పిలుచుకోవడం చూసి ఈ జంట అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక త్వరలోనే పెళ్లి తేదీ కూడా ప్రకటించాలని కామెంట్లు చేయడం గమనార్హం.
రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోగా.. అటు విజయ్ దేవరకొండ కూడా వరుసగా డైరెక్టర్లకు అవకాశాలిస్తూ సక్సెస్ కొట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
