Begin typing your search above and press return to search.

మళ్లీ జోడీగా విజయ్, రష్మిక.. ఈసారి ఏం చేస్తారో..

అదే సమయంలో 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   5 Sept 2025 8:00 AM IST
మళ్లీ జోడీగా విజయ్, రష్మిక.. ఈసారి ఏం చేస్తారో..
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

అదే సమయంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల తర్వాత మళ్లీ ఎప్పుడు జోడీగా నటిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విజయ్, రష్మిక సైలెంట్ గా మూడో సినిమాను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి హడావుడి లేకుండా ఇటీవల హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైనట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమా కథ విన్న వెంటనే రష్మిక ఓకే చెప్పారని తెలుస్తోంది. హిట్ పెయిర్ రిపీట్ అవ్వడంతో అప్పుడే ఆడియన్స్ తో పాటు ఇద్దరి అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి.

అదే సమయంలో 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో, ఇప్పటివరకు ఎప్పుడూ పోషించని ఒక విలక్షణమైన పల్లెటూరి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కెరీర్ లో అలాంటి పాత్ర చేయడం ఫస్ట్ టైమ్.

సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ అద్భుతమైన స్క్రీన్‌ ప్లేతో మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే థ్రిల్, ఎమోషన్ ను మిళితం చేసే భారీ యాక్షన్ రొమాన్స్ మూవీని ఆయన తీస్తున్నారని ఇప్పుడు తెలుస్తోంది.

కాగా.. ఒకప్పుడు గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు విజయ్, రష్మిక. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయారు. కానీ తమ మధ్య కెమిస్ట్రీతో మెప్పించారు. యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో.. ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.