పెళ్లి ఫోటోలు పంచుకున్న విజయ్ దేవరకొండ.. చూడ చక్కని జంట!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 26 Feb 2026 7:15 PM IST
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2018లో వచ్చిన 'గీతాగోవిందం' సినిమాతో తమ అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అప్పటినుంచి రిలేషన్ కొనసాగిస్తున్న వీరిద్దరూ మీడియా కంట పడకుండా జాగ్రత్తపడ్డారు .కానీ అభిమానులు ఊరుకుంటారా? "విరోష్" అంటూ ఈ జంటకు ముద్దుగా పేరు కూడా పెట్టేశారు. ఇక ఎప్పుడెప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త తెలుపుతూ ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ అభిమానులు ప్రేమగా పెట్టిన పేరును స్వీకరిస్తున్నాం అంటూ ప్రకటించారు.
అందులో భాగంగానే ఉదయపూర్ లోని హై ప్రొఫైల్ వెడ్డింగ్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఉదయం 10:10 గంటలకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మళ్లీ ఇదే రోజు సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మత సాంప్రదాయ ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే గత ఎనిమిది సంవత్సరాలుగా తమ రిలేషన్ తో అందరిని అయోమయంలో పడేసిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇక ఈ జంట పెళ్లి ఫోటోలు చూడడానికి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. అంతేకాదు ఈ క్షణం కోసం ఎదురు చూడలేక అత్యాధునిక టెక్నాలజీ అయిన ఏఐ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి సంతృప్తి పడ్డారు.
ఇక అందరి అంచనాలకు తెర దింపుతూ ఎట్టకేలకు విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక లక్ష్మీ నారాయణుల లాగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పెళ్లి ఫోటోలను విజయ దేవరకొండ పంచుకుంటూ రష్మిక మందన్నపై తనకున్న ప్రేమను వలకబోశారు.
ఈ మేరకు విజయ్ దేవరకొండ.. "అనుకోకుండా ఒక రోజు నేను రష్మికను మిస్ అయ్యాను. తను ఉంటే ఈరోజు బాగుండేదని నాకు అనిపించే విధంగా నేను ఆమెను మిస్ అయ్యాను. తను నా ఎదురుగా కూర్చుంటే నా భోజనం మరింత ఆరోగ్యంగా ఉండేది. ఆమె నాతో కలిసి చేసే వ్యాయామాలు నన్ను మరింత సరదాగా మార్చేసేవి. ఆమె ఉన్న ప్రతి చోట ఇంటి అనుభూతి కలుగుతుంది. ప్రశాంతతను పొందడానికి మార్గం ఏర్పడుతుంది.. ఆమె నా జీవితంలోకి వచ్చిన ఆణిముత్యం" అన్నట్టు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పై ఉన్న తన ప్రేమను వలకబోశారు. ఎట్టకేలకు ఈ అందాల ముద్దుగుమ్మను తన భాగస్వామిగా చేసుకొని కొండంత ప్రేమను పొందడానికి సిద్ధం అయిపోయారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
