#గుసగుస.. విజయ్-రష్మిక పెళ్లి వెన్యూ ఇదేనా?
సైలెంట్ గా తన ప్రియురాలు రష్మిక మందన్నతో నిశ్చితార్థం జరుపుకున్న విజయ్ తదుపరి పెళ్లి కోసం అతిథుల జాబితాను రెడీ చేస్తున్నాడు.
By: Sivaji Kontham | 4 Oct 2025 11:40 AM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా తన ప్రియురాలు రష్మిక మందన్నతో నిశ్చితార్థం జరుపుకున్న విజయ్ తదుపరి పెళ్లి కోసం అతిథుల జాబితాను రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో పెళ్లి వెన్యూ కోసం రకరకాల డెస్టినేషన్స్ ని వెతుకుతున్నట్టు తెలిసింది.
ఒకవేళ విజయ్- రష్మిక జంట ప్రధానంగా రెండు ఆకర్షణీయమైన వేదికలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరిలో శుభముహూర్తం ఖరారు చేస్తారని కూడా తెలుస్తోంది. ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేస్తే, అది కచ్ఛితంగా రాజస్థాన్ లోని జైపూర్ వేదిక అవుతుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఒకవేళ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశాలకు వెళితే గనుక, ఇటలీ లేక్ కోమో ప్లేస్ ని పరిశీలిస్తారని కూడా అభిమానులు ఊహిస్తున్నారు. రాజస్థాన్ లోని భారీ కోట లాంటి విలాసవంతమైన వెన్యూ అయితే అది భారీతనంతో ప్రత్యేక శోభను సంతరించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇటలీలోని అరుదైన ఎగ్జోటిక్ లొకేషన్ లో పెళ్లిని ప్లాన్ చేసినా అది చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. అయితే కొత్త జంట ఛాయిస్ ఏది అవుతుందో కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు. ప్రస్తుతానికి ఇవన్నీ అభిమానుల ఊహాగానాలు మాత్రమే.
స్టార్ కపుల్ జాబితాలోకి చేరిన జంట:
టాలీవుడ్ నుంచి నాగార్జున- అమల, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, నాగచైతన్య- శోభిత, కిరణ్ అబ్బవరం- రహస్య తర్వాత ఇప్పుడు విజయ్- రష్మిక స్టార్ కపుల్ జాబితాలో చేరారు. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్- దీపిక, రణబీర్ - ఆలియా, అజయ్ దేవగణ్- కాజోల్, అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా, విక్కీకౌశల్- కత్రిన కైఫ్ తదితరులు స్టార్ కపుల్ గా జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే.
