Begin typing your search above and press return to search.

విజయ్‌ - రష్మిక వెడ్డింగ్‌... స్టార్‌ గెస్ట్స్‌ ఎవరు?

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2025న ఉదయపూర్‌లోని ప్రముఖ కోటలో జరుగనున్నట్లు తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   21 Feb 2026 10:00 PM IST
విజయ్‌ - రష్మిక వెడ్డింగ్‌... స్టార్‌ గెస్ట్స్‌ ఎవరు?
X

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2025న ఉదయపూర్‌లోని ప్రముఖ కోటలో జరుగనున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అనే ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇతర స్టార్‌ సెలబ్రిటీ కపుల్‌ మాదిరిగా వీరిది కేవలం తాత్కాలిక ప్రేమ అంటూ ఎగతాళి చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వీరి ప్రేమ సుదీర్ఘ కాలం కొనసాగి ఇప్పుడు పెళ్లి వరకు చేరింది. ఇప్పటి వరకు రష్మిక మందన్న గురించి విజయ్‌ దేవరకొండ కానీ, విజయ్‌ దేవరకొండ గురించి రష్మిక మందన్న కానీ ఏ ఒక్క విషయాన్ని బహిర్గతంగా మాట్లాడిందే లేదు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చారు. ఎంత సీక్రెట్‌ మెయింటెన్ చేసినా సోషల్‌ మీడియా జనాలు వదిలి పెట్టలేదు. ఏదో ఒక చోట వీరిని పట్టుకునే ప్రయత్నం చేశారు.

పెళ్లికి సిద్ధం అయిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న

ఇద్దరు ట్రిప్‌ కి వెళ్లిన సమయంలో సోలోగా దిగిన ఫోటోలను కలిపి చూపించి, ఇదుగో సాక్ష్యం అనడం, మరికొన్ని సార్లు వారు మాట్లాడిన మాటలను బట్టి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అనడం చేస్తూ వచ్చారు. ఫైనల్‌గా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, పెళ్లికి కూడా రెడీ అయ్యారు అనేది వాస్తవం. గత ఏడాదిలోనే వీరి వివాహ నిశ్చితార్థం జరిగినా కనీసం చిన్న ఫోటో లీక్‌ కాలేదు అంటే ఏ స్థాయిలో వీరు మేనేజ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇప్పుడు పెళ్లి ఫోటోలు అయినా వీరు బయటకు వదులుతారా అనే చర్చ మొదలైంది. మరో వైపు వీరి పెళ్లికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు ఎవరు అనేది కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చర్చ. ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వారు, పైగా ఇద్దరు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వర్క్ చేశారు, ఇద్దరు స్టార్స్‌ తో కలిసి వర్క్ చేసిన అనుభవం ఉంది. కనుక ఆ స్టార్స్ ఈ పెళ్లికి హాజరు అయ్యేనా అనేది చూడాలి.

బాలీవుడ్‌ నుంచి ఎంత మంది స్టార్స్‌కి రష్మిక ఆహ్వానం..

ఇప్పటి వరకు ఏ స్టార్స్‌ కి ఇన్విటేషన్ వెళ్లింది అనే విషయంలో క్లారిటీ లేదు. పెళ్లికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానాల్లో బంధు మిత్రులు ఒకటి రెండు రోజుల్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు పెళ్లి చేసుకోబోతున్న జంట ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎన్ని వార్తలు వచ్చినా అవి ఊహాగాణాలే తప్ప, ఆ రెండు ఫ్యామిలీ ల నుంచి చిన్న ప్రకటన కూడా రావడం లేదు. ఆ మధ్య ఇన్విటేషన్ కార్డ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ ఇన్విటేషన్ అయినా నిజమేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. మరీ ఇంత సీక్రెట్‌గా ఒక వివాహం, అది కూడా స్టార్‌ హీరోయిన్‌, హీరో వివాహం జరగాలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రష్మిక మందన్నకు ఉన్న భారీ ఫాలోయింగ్ నేపథ్యంలో ఆమె పెళ్లి గురించి జాతీయ స్థాయిలో సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

విజయ్ దేవరకొండ వివాహ రిసెప్షన్‌..

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న హిందీ, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో చాలా సినిమాలు చేసింది. ఆ సినిమాలకు వర్క్‌ చేసిన స్టార్స్‌, టెక్నీషియన్స్‌ తో ఆమె కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సన్నిహితంగా ఉన్న వారిని అయినా పెళ్లికి పిలవాల్సి ఉంటుంది. మరి రష్మిక వారిలో ఎంత మందిని పెళ్లికి ఆహ్వానించింది, ఇండస్ట్రీలో విజయ్‌ దేవరకొండకి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వారిలో ఎంత మందికి పెళ్లి ఆహ్వాన పత్రికలు వెళ్లాయి అనేది తెలియాల్సి ఉంది. పెళ్లి హైదరాబాద్‌లో అయ్యి ఉంటే తప్పకుండా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరు అయ్యే వారు. కానీ ఉదయ్‌పూర్‌ అనే ప్రచారం జరుగుతున్న కారణంగా ఎవరు అంత దూరం వెళ్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ వివాహం అక్కడ జరిగింది. పెళ్లి అక్కడ జరిపి రిసెప్షన్‌ ను హైదరాబాద్‌ లో చేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. మరి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో జరిగేనా చూడాలి.