విజయ్- రష్మికల పెళ్లికి ముహూర్తం ఫిక్స్? పెళ్లి ఎప్పుడంటే..
సినీ ఇండస్ట్రీలో ఉండే లవ్ స్టోరీలు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అఫీషియల్ గా అనౌన్స్ చేయని రిలేషన్ పై ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Nov 2025 8:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఉండే లవ్ స్టోరీలు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అఫీషియల్ గా అనౌన్స్ చేయని రిలేషన్ పై ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా విషయంలోనూ అదే జరుగుతోంది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండగా, ఇప్పుడు వారు తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్న విజయ్- రష్మిక
ఆల్రెడీ వీరిద్దరికీ అక్టోబర్ లో ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో కూడా రష్మిక తన ఎంగేజ్‌మెంట్ రింగ్ ను పెట్టుకుని అందరికీ తన నిశ్చితార్థం విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు.
ఫిబ్రవరి 26న విజయ్ తో రష్మిక పెళ్లి
పైగా ఆ రింగ్ గురించి ఎవరు అడిగినా సిగ్గు పడుతుంది, మీకు నచ్చింది అనుకోండి అంటుంది తప్పించి నిజాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. విజయ్ కూడా ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ రింగ్ తో పలుమార్లు కనిపించారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సెన్సేషనల్ జంట ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి రోజుకో వార్త వస్తున్నప్పటికీ అటు రష్మికనో ఇటు విజయ్‌నో దీన్ని ఖండించడం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం కానీ చేయకపోవడంతో ఆ వార్తలకు మరింత ఊపిరి పోసినట్టవుతుంది. మరి విజయ్- రష్మికల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ముహూర్తం డేట్ ను శాస్త్రాల ప్రకారం పండితులు ఫిక్స్ చేశారా లేదా నెటిజన్లు ఫిక్స్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా విజయ్, రష్మికల గురించి వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు.
