Begin typing your search above and press return to search.

కూర్గ్ రిసార్ట్‌లో కొత్త జంట‌ హ‌నీమూన్.. ఒక రాత్రికి ఎంత‌ బిల్లు వ‌చ్చిందంటే?

టాలీవుడ్ క్రేజీయెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   19 April 2026 12:09 AM IST
కూర్గ్ రిసార్ట్‌లో కొత్త జంట‌ హ‌నీమూన్.. ఒక రాత్రికి ఎంత‌ బిల్లు వ‌చ్చిందంటే?
X

టాలీవుడ్ క్రేజీయెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. పెళ్లి వేడుకను అత్యంత గోప్యంగా ముగించిన ఈ జంట హనీమూన్ విష‌యంలోను అదే సీక్రసీ మెయింటెయిన్ చేసారు. అయితే ఈ జంట విదేశీ డెస్టినేష‌న్ కి వెళ్లకుండా స్వదేశీ అందాలనే ఎంచుకోవడం విశేషం. కర్ణాటకలోని పాపుల‌ర్ హిల్ స్టేషన్ `ఇండియాస్ స్కాట్లాండ్` గా పిలుచుకునే కూర్గ్ (కొడగు) ప్రాంతాన్ని తమ ఏకాంతం కోసం ఎంపిక చేసుకున్నారు. రష్మికకు ఇది సొంత రాష్ట్రం కావడంతో అక్కడి ప్రకృతి ఒడిలో విజయ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త జంట కూర్గ్‌లోని దట్టమైన కాఫీ తోటల మధ్య ఉన్న ఒక అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. మంచుతో నిండిన కొండలు, ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ రిసార్ట్‌లో ఒక రాత్రికి అద్దె దాదాపు 1లక్ష రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, స్పా వంటి అత్యాధునిక సౌకర్యాలతో పాటు బయటి ప్రపంచానికి దూరంగా సంపూర్ణ ప్రైవసీని అందించేలా ఈ రిసార్ట్ ని డిజైన్ చేయడం విశేషం. షూటింగ్స్, బిజీ లైఫ్ నుండి విరామం తీసుకున్న ఈ జంట అక్కడ స్థానిక కూర్గ్ వంటకాలను రుచి చూస్తూ ప్రకృతితో మ‌మేక‌మ‌య్యారు.

సోషల్ మీడియాలో ఈ జంట హనీమూన్ వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నా ఫోటోలు లీక్ కాకుండా ఈ జంట‌ చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు కావడంతోనే విదేశీ పర్యటనల కంటే స్వ‌దేశంలోని పచ్చదనాన్ని ఇష్టపడినట్లు తెలుస్తోంది. తమ అభిమాన స్టార్స్ ఒకటైనందుకు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుంటే వారి హనీమూన్ ముచ్చట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పచ్చని తోటలు, జలపాతాల మధ్య సాగుతున్న వీరు ఈ `ప్రైవేట్ ఎస్కేప్` పర్యాటక రంగంలోనూ కూర్గ్ ప్రాంతానికి మరింత క్రేజ్ పెంచుతోంది.

విజ‌య్- ర‌ష్మిక జంట ఆద‌ర్శం:

సెలబ్రిటీలు తమ విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లకుండా స్వదేశంలోని పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడం అనేది ఆ ప్రాంత అభివృద్ధికి ఎన‌ర్జీనిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీనివల్ల కలిగే ఆర్థిక - పర్యాటక ప్రయోజనాలను విశ్లేషిస్తే..సెలబ్రిటీల రాకతో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ఒక సానుకూల పరిణామమే.

పెళ్లి త‌ర్వాత విజ‌య్ - ర‌ష్మిక

పెళ్లి త‌ర్వాత న‌వ‌దంప‌తులు క‌లిసి న‌టిస్తున్న సినిమా ర‌ణ‌బ‌లి. ఈ చిత్ర కథాంశం ఒక శక్తివంతమైన సామాజిక పోరాటం చుట్టూ తిరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే ఒక యువకుడి ప్రయాణాన్ని భావోద్వేగపూరితమైన యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో విజయ్ దేవరకొండ తన మార్క్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించగా..రష్మిక మందన్న నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇప్పటికే వెండితెరపై మ్యాజిక్ సృష్టించింది. ఈ చిత్రంలో ప్ర‌ధాన‌ పాత్రల మధ్య పండే ప్రేమ , సంఘర్షణ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విడుదల విషయానికి వస్తే... రణబలి ఈ ఏడాది జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ .. రష్మిక మందన్న పాన్-ఇండియా పాపులారిటీ కలగలిసి ఈ సినిమాపై భారీ క్రేజ్‌ను సృష్టించాయి. వేసవి సెలవుల ముగింపులో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.