Begin typing your search above and press return to search.

స్క్రీన్‌పై రియల్ జంట మ్యాజిక్.. ‘ఏందయ్యా సామి’ BTS వీడియో వైరల్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి

By:  Madhu Reddy   |   25 Sept 2026 1:24 PM IST
స్క్రీన్‌పై రియల్ జంట మ్యాజిక్.. ‘ఏందయ్యా సామి’ BTS వీడియో వైరల్!
X

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘ఏందయ్యా సామి’ అంటూ సాగే రొమాంటిక్ అండ్ ఫోక్ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధాన్ని, అల్లరిని ఈ పాటలో అద్భుతంగా చూపించినట్లు మేకింగ్ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

పెళ్లి తర్వాత తొలి సినిమా కావడంతో భారీ హైప్ :

టాలీవుడ్ ట్రెండింగ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్-రష్మిక నిజ జీవితంలో ఒక్కటైన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, తాజాగా వచ్చిన ‘ఏందయ్యా సామి’ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆన్-స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీకి రియల్ లైఫ్ మ్యాజిక్ కూడా తోడవడంతో ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

లవ్‌లీ బిహైండ్ ద సీన్స్ :

ఈ మేకింగ్ వీడియోలో విజయ్, రష్మికల మధ్య ఉన్న సరదా సన్నివేశాలు, డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పీరియడ్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో సాగే ఈ పాట కోసం ఇద్దరూ ఎంత కష్టపడ్డారో మేకింగ్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వున్నా సీన్స్ ఈ వీడియో లో మనం చూడచ్చు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ప్రతి సీన్‌ను చాలా రిచ్‌గా, నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్న తీరు ఈ మేకింగ్ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

చరిత్రలో దాగున్న ఒక అరుదైన కథ:

బ్రిటీష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ వీరుడైన ‘రణబాలి’ పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక ఆయన సతీమణి ‘జయమ్మ’ పాత్రలో శక్తివంతమైన అభినయాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అక్టోబర్ 16న గ్రాండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ :

భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అజయ్-అతుల్ అందిస్తున్న సంగీతం, ఆనాటి వాతావరణాన్ని తలపించే విజువల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మేకింగ్ వీడియోతోనే అంచనాలను తారాస్థాయికి చేర్చిన ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.