Begin typing your search above and press return to search.

'విరోష్' సంగీత్ మూమెంట్స్.. మామూలుగా లేవుగా!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా వివాహ బంధంతో ఒక్కటవ్వగా.. ప్రస్తుతం పెళ్లి తర్వాత రిచువల్స్ తో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   3 March 2026 10:40 AM IST
విరోష్ సంగీత్ మూమెంట్స్.. మామూలుగా లేవుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా వివాహ బంధంతో ఒక్కటవ్వగా.. ప్రస్తుతం పెళ్లి తర్వాత రిచువల్స్ తో బిజీగా ఉన్నారు. సోమవారం నాడు విజయ్ తన వైఫ్ తో స్వగ్రామమైన తెలంగాణలోని నాగర్‌ కర్నూల్ జిల్లా తుమ్మెన్ పేటలో సందడి చేశారు. కొత్తగా నిర్మించిన ఇంటికి విజయ్- రష్మిక దంపతులు గృహప్రవేశం చేశారు.




ఆ తర్వాత వేద పండితుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఆ వేడుకలో విజయ్ దంపతులు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో ఆకట్టుకున్నారు. వ్రతం పూర్తయ్యాక.. ఊరు అందరికీ భోజనాలు పెట్టారు. వేదికపై మాట్లాడుతూ పలు హామీలు కూడా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.




అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు విజయ్ తమ సంగీత్ పిక్స్ ను పోస్ట్ చేశారు. గత నెల 24వ తేదీన సంగీత్ జరగ్గా.. ఆ ఫొటోస్ ను షేర్ చేశారు. ప్రస్తుతం అవి ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు నృత్యం డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్ లతో గడిపిన సాయంత్రమంటూ రాసుకొచ్చారు.




అందమైన వ్యక్తులతో నిండిన పెద్ద సంతోషకరమైన పార్టీ అని చెప్పారు. తెల్లవారుజామున నాలుగు వరకు అయిందని చెప్పారు. అయితే విజయ్ షేర్ చేసిన పిక్స్ అదిరిపోయాయని చెప్పాలి. కొత్త జంట.. సంగీత్ కాస్ట్యూమ్స్ లో చాలా అందంగా ఉన్నారు. ఫుల్ ఎంబ్రాయిడరీ బ్లూ వెల్వెట్ శెర్వానీలో విజయ్ దేవరకొండ, క్రీమ్ కలర్ హెవీ లెహెంగాలో రష్మిక మెరిసిపోయారు.




ముఖ్యంగా రష్మికను పట్టుకుని విజయ్ చేసిన డ్యాన్స్ సూపర్ అని చెప్పాలి. ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని రావడం.. అంతకు ముందు స్పెషల్ వెహికల్ లో ట్రావెల్ చేయడం.. చుట్టూ కజిన్స్ డ్యాన్స్ తో సందడి చేయడం.. విజయ్ తల్లి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం.. కొత్త జంట ఒకరి కళ్ళలోకి కళ్ళలోకి చూసుకోవడం.. వంటి మూమెంట్స్ ను విజయ్ షేర్ చేయగా.. అందరినీ మెప్పిస్తున్నాయి.




దీంతో ఇప్పుడు వాటిని విజయ్- రష్మిక అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. లైక్స్ కొడుతూ.. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అప్పుడే ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. సంగీత్ పిక్స్ మామూలుగా లేవని, అదిరిపోయాయని అంతా చెబుతున్నారు. లైఫ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ లో ఒకటైన సంగీత్ ను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.